'పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు నాటకం' | kapu leaders takes on chandrababu | Sakshi
Sakshi News home page

'పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు నాటకం'

Published Sat, Mar 5 2016 1:22 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

kapu leaders takes on chandrababu

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై కాపు సంఘం నేతలు శనివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. కాపులను నమ్మించి పచ్చి మోసం చేశారని చంద్రబాబుపై కాపు సంఘం నేతలు తోకల అశోక్ కుమార్, కిశోర్, లక్ష్మీపతి మండిపడ్డారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ వెనక వైఎస్ జగన్ ఉన్నాడని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.

మార్చి 11వ తేదీ నుంచి తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. ముద్రగడకు వెన్నుదన్నుగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు. ఏ ఉద్యమానికైనా ప్రతిపక్షాలు మద్దతు తెలపడం సర్వ సాధారణమని.. అంతమాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం దుర్మార్గమని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement