సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఉత్సవాలు జరపాలని వెంకయ్యనాయుడు కోరడం సరికాదని ఎంపీ కవిత అన్నారు
కరీంనగర్: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కోరడం సరికాదని ఎంపీ కవిత అన్నారు. సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తున్న విషయాన్ని వెంకయ్యనాయుడు మర్చిపోయినట్టున్నారని కవిత తెలిపారు.
హిందూ, ముస్లింల సఖ్యత దెబ్బతీసేందుకే...బీజేపీ విమోచన దినం పాటించాలని కోరుతుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని విడగొట్టడానికి తాము వ్యతిరేకమన్నారు. గద్వాల జిల్లా కోసం డీకే అరుణ చేస్తున్న ఆందోళనను విరమించాలని కవిత సూచించారు. కొత్త జిల్లాల డిమాండ్‌ను కేసీఆర్ చూస్తున్నారని కవిత చెప్పారు.