
కేసీఆర్ సర్కార్ అవినీతిమయం
కేసీఆర్ సర్కార్ పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.
♦ రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట
♦ జడ్జీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
ఇబ్రహీంపట్నం: కేసీఆర్ సర్కార్ పాలన అవినీతిమయంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఇబ్రహీంపట్నం వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్ బీజేపీలో చేరిన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయ న మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. రీ డిజైనింగ్ పేరుతో రూ.31 వేల కోట్ల వ్యయంతో నిర్మాణమయ్యే ప్రాజెక్టుల వ్యయాన్ని సర్కార్ రూ.81 కోట్లకు పెంచి అవినీతికి, అక్రమాలకు పాల్పడుతుందన్నారు. నీళ్లు, ని ధులు, ఉద్యోగాల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చుక్కలు చూపుతున్నాడన్నారు. ఒక్క డీఎస్సీని కూడా వేయలేకపోయిందన్నారు.
తెలంగాణకు అడ్డుపడిన వారిని పార్టీలో చేర్చుకుంటూ అందలమెక్కిస్తూ, ఉద్యమించిన వారిని బయటకు పంపుతున్నారని విమర్శించారు. ఎంతోమంది విద్యార్థుల, యువకుల త్యాగాల ఫలితం.. తమ పార్టీ అండదండలతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తే.. నేడు రాష్ట్రంలో నాలుగు స్తంభాలాట కొనసాగుతుందన్నారు. అ న్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ ప్రధాని రూ.90 వేల కోట్లను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందన్నారు. రూ.43 వేల కోట్లను జాతీయ రహదారులకు కేంద్రం కేటాయించిందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం విడుదల చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందన్నారు. రాష్ట్రంలో న్యాయాధికారులు, న్యాయవాదులు చేస్తున్న ఆందోళన న్యాయసమ్మతమైనా కేసీఆర్ దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జడ్జీల సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. హైకోర్టు విభజన సమస్యపై ఢిల్లీలో కాదు అమరావతిలో కేసీఆర్ దీక్ష చేస్తే బాగుంటుందన్నారు. తెలంగాణ వచ్చి న తర్వాత నిరుద్యోగులను ఆదుకునేం దుకు కేసీఆర్ ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. రాజకీయ వలసలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజల ను చైతన్యపరచాలన్నారు. ఈ సందర్బంగా కొత్త అశోక్‌గౌడ్‌కు కండవా కప్పి పార్టీలోకి సాదరంగా లక్ష్మణ్ ఆహ్వానించారు. ముత్యాల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్కా మధుసూధన్‌రెడ్డితోపార్టీ నేతలు ఆచారి, మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, అర్జున్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్‌యాదవ్, విక్రమ్‌రెడ్డి, బోజిరెడ్డి, అర్జున్‌రెడ్డి, సత్యనారాయణ, గణేష్, రవీందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాషా, లచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.
కోలహలంగా అశోక్‌గౌడ్ చేరిక..
వైస్ ఎంపీపీ కొత్త అశోక్‌గౌడ్ బీజేపీలో చేరిక సందర్భంగా కళాకారులతో ఆట పాటలు, లంబాడీల నృత్యాలతో పట్టణంలో ఉరేగింపు నిర్వహించారు. పార్టీ శ్రేణులు డప్పు, కొమ్ముల వాయిద్యాలు, టపాకాయలు, బాణాసంచాలు కాల్చు తూ లక్ష్మణ్‌కు స్వాగతం పలికారు.