
ముగిసిన ఖేలో ఇండియా క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఖేలో ఇండియా క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. శనివారం క్రీడా పోటీలు ముగియాల్సి ఉండగా వర్షం పడడంతో ఆదివారానికి వాయిదా వేశారు. అండర్–14, 17 ఫుట్‌బాల్ క్రీడా పోటీలు స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. క్రీడా పోటీలు ముగిసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషామోహిద్దీన్ తెలిపారు. విజేత జట్లను రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వరుసగా
అండర్–14 ఫుట్‌బాల్ బాలురు
పెనుకొండ–1, గుంతకల్–2, రాప్తాడు–3.
బాలికలు
రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, రాయదుర్గం–3.
అండర్–17 ఫుట్‌బాల్ బాలురు
రాప్తాడు–1, కళ్యాణదుర్గం–2, గుంతకల్–3.
బాలికలు
ఉరవకొండ–1, కళ్యాణదుర్గం–2, ధర్మవరం–3.