కుందుర్పి ఎస్‌ఐ వేణుగోపాల్‌ సస్పెన్షన్‌ | kundurpi si suspension | Sakshi
Sakshi News home page

కుందుర్పి ఎస్‌ఐ వేణుగోపాల్‌ సస్పెన్షన్‌

Published Thu, Oct 13 2016 11:39 PM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM

kundurpi si suspension

అనంతపురం సెంట్రల్‌ : కుందుర్పి ఎస్‌ఐ వేణుగోపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజశేఖరబాబు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపారు. కుందుర్పి స్టేషన్‌ పరిధిలో ఓ కేసులో విచారణ చేయకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, కౌంటర్‌ కేసులు పెట్టించడం, ప్రాపర్టీస్‌ సరిగా చూపకపోవడం, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అవినీతి ఆరోపణలపై ఎస్పీ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో విచారణ అనంతరం నివేదిక ఆధారంగా అతన్ని సస్పెండ్‌ చేసినట్లు అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement