బెంగళూరులో వలస కూలీ మృతి | labour dies in bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో వలస కూలీ మృతి

Published Thu, Jul 6 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

labour dies in bangalore

బ్రహ్మసముద్రం : బతుకుతెరువు కోసం బెంగళూరు పట్టణానికి వలస వెళ్లిన చెలిమేపల్లి గ్రామానికి చెందిన కూలీ ఆంజనేయులు (40) అక్కడ అకస్మికంగా మృతి  చెందినట్లు గ్రామానికి గురువారం సమాచారం అందింది. రెండు నెలల క్రితం భార్య రాజమ్మతో కలసి అతడు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. బుధవారం అక్కడ భవన నిర్మాణ పనులు చేస్తున్న  సమయంలో అస్వస్థతతకు గురై మృతి చెందాడన్నారు. వారికి కూతురు చిట్టెమ్మ, కుమారుడు  వన్నూరుస్వామి ఉన్నారు. వీరు గ్రామంలోనే అమ్మమ్మ లింగమ్మ  దగ్గర ఉంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement