labour dies
-
పండుగకు వచ్చి పరలోకాలకు..
పుట్టపర్తి అర్బన్: పొట్ట కూటి కోసం వలస వెళ్లి.. వినాయక చవితిని స్వగ్రామంలో చేసుకుందామని వచ్చిన కూలీని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పుట్టపర్తి రూరల్ ఇన్చార్జి ఎస్ఐ రాజశేఖరరెడ్డి, ఏఎస్ఐ ప్రసాద్, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కొట్లపల్లికి చెందిన పెద్దన్న, మణెమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరిగెప్పగారి ప్రతాప్ (25) బెంగళూరులో టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి స్వగ్రామం కొట్లపల్లికి వచ్చాడు. శుక్రవారం గణపతి పూజ అయిన అనంతరం భోజనం ముగించుకుని బుగ్గపల్లిలో రైతు వద్ద తనకు రావాల్సిన కూలి డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ పని చూసుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బుగ్గపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లాడు. పెద్ద బండరాయిపై ఎగిరిపడిన ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ‘ఏ పని చెప్పినా ఇట్టే చేసిపెట్టేవాడని.. ఇద్దరి పని ఒకడే చేసే వాడని.. చిన్న వయసులోనే మాకు దూరం చేశావా దేవుడా.. అని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
ఎంతపని చేశావయ్యా దేవుడా..
- లారీ ఢీకొని వ్యవసాయ కూలీ మృతి - మిన్నంటిన ఆర్తనాదాలు పండుగ సరుకులు తెస్తానంటివి.. అంతలోనే మా నుంచి దూరమైపోయావా! ఎంత పని చేశావయ్యా దేవుడా... అనే రోదనలతో ఆ ప్రాంతం దద్దరల్లింది. ఐదు దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న భర్త.. విగతజీవుడై పడి ఉండగా ఇల్లాలి వేదనకు అంతులేకుండా పోయింది. మలి సంధ్యలో తనకు తోడు లేకుండా పోయాడన్న వేదన ఆమెను కలిచి వేసింది. - ఓడీ చెరువు: ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందివారిపల్లికి చెందిన బైముతక రంగప్ప( 65) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినాయక చవితి పండుగకు కావాల్సిన సరుకులు తీసుకువచ్చేందుకు స్కూటర్‌పై వెళ్లిన అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా మహమ్మదాబాద్ క్రాసింగ్ సమీపంలోని బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఘటనలో లారీ కిందకు స్కూటర్ వెళ్లిపోయింది. వెనుక చక్రాలు రంగప్ప తలపై నుంచి దూసుకెళ్లాయి. తల నుజ్జునుజైంది. కుడి భుజం, చేయి నలిగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి పారిపోయాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాన్నా మా అందర్నీ వదలిపోతివా కుమారుడు, కుమార్తె రోదనలు స్థానికులను కలిచివేశాయి,. మృతుడి భార్య గంగులమ్మ రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఘటన స్థలాన్ని అమడగూరు ఎస్ఐ చలపతి, హెడ్‌కానిస్టేబుల్ నాగభూషణం పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
అమడగూరు: అ గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటాల నారాయణ కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ వివిధరకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పనులకు వెళ్లే నిమిత్తం నారాయణ ఆదివారం రోడ్డు దాటుతుండగా బీఎంటీసీ సిటీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. -
బెంగళూరులో వలస కూలీ మృతి
బ్రహ్మసముద్రం : బతుకుతెరువు కోసం బెంగళూరు పట్టణానికి వలస వెళ్లిన చెలిమేపల్లి గ్రామానికి చెందిన కూలీ ఆంజనేయులు (40) అక్కడ అకస్మికంగా మృతి చెందినట్లు గ్రామానికి గురువారం సమాచారం అందింది. రెండు నెలల క్రితం భార్య రాజమ్మతో కలసి అతడు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. బుధవారం అక్కడ భవన నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో అస్వస్థతతకు గురై మృతి చెందాడన్నారు. వారికి కూతురు చిట్టెమ్మ, కుమారుడు వన్నూరుస్వామి ఉన్నారు. వీరు గ్రామంలోనే అమ్మమ్మ లింగమ్మ దగ్గర ఉంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : మండలంలోని ఓబుళంపల్లికి చెందిన ఉపాధి కూలీ పాలేటక్క (50) వడదెబ్బతో గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. మంగళవారం ఉపాధిపనులకు వెళ్లిన పాలేటక్క... పని ప్రాంతంలోనే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు ఆమెను ఇంటికి పంపారు. బుధవారం పుట్టపర్తిలోని ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. కాగా, పాలేటక్కకు భర్త లింగన్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
ఓడీ చెరువు : ఓడీచెరువు మండలం మద్దకవారిపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ శ్రీరాములు (50) కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా మారగానికుంట్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మద్దకవారిపల్లికి చెందిన ఆయన మారగానికుంట్ల మీదుగా బెంగళూరుకు బయలు దేరాడు. తెలిసిన వ్యక్తి ద్విచక్రవాహనం రావడంతో శ్రీరాములు వాహనం వెనక కూర్చొన్నాడు. కొంత దూరం వెళ్లగానే వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న శ్రీరాములు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి పోయాడని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కర్మాగారంలో కార్మికుడి మృతి
తాడిపత్రి టౌన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని ఎస్జేకే స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్(కార్మికుడు)గా పని చేసే కర్నూలుకు చెందిన షెక్షావలి(40) గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. అవివాహితుడైన షెక్షావలి తాడిపత్రిలో వడ్లపాలెంలో అద్దె ఇంట్లో ఉంటూ కర్మాగారానికి వెళ్లొచ్చేవాడన్నారు. నరాల బలహీనతో బాధపడేవాడని, ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో ఉన్న పళంగా కిందపడటంతో రాయిపై తలపడటంతో తీవ్ర గాయమైందన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వడదెబ్బతో కూలీ మృతి
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన శివప్రసాద్ (28) అనే కూలీ వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శివప్రసాద్ తాడిపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక ఒక్కసారిగా కూప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య సరోజ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి
ధర్మవరం అర్బన్ : ధర్మవరం శాంతినగర్‌లో చెన్న ఆదినారాయణ(53) అనే చేనేత కార్మికుడు వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడని బంధువులు తెలిపారు. ఉదయమే ఆరోగ్యం సరిగా లేదని భార్య వెంకటలక్ష్మీకి చెప్పగా, ఆమె వెంటనే ప్రభుత్వాస్పత్రికి పిల్చుకెళ్లినట్లు వివరించారు. అక్కడ చికిత్స చేయించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి కుమారుడు మురళీ, కుమార్తె శైలజ ఉన్నారు. -
చెట్టుపై నుంచి పడి కూలీ మృతి
రొళ్ల (మడకశిర) : రొళ్ల మండలం వన్నప్పపాళ్యం గ్రామానికి చెందిన పాండురంగప్ప (60) అనే కూలీ చింతచెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్ బషీర్ తెలిపిన మేరకు.. పాండురంగప్ప చింతకాయలను తొలగించేందుకు తోటి కూలీలతో కలిసి క్యాతప్పపాళ్యం వద్దకు వెళ్లాడు. చింతచెట్టు ఎక్కికాయలను తొలగిస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు రంగనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వలస కూలీ దుర్మరణం
రాయదుర్గం రూరల్ : జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక పొట్టకూటికి పొరుగు రాష్ట్రానికెళ్లిన ఓ భవననిర్మాణ కూలి శుక్రవారం బెంగళూరులోని ఓ ఐదంతస్తుల భవనం నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు .. రాయదుర్గం మండలం ఆయతపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగరాజు (30), రుద్రమ్మ దంపతులు. వీరికి ఐశ్వర్య, దీపిక సంతానం. అయితే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నాగరాజు తన పిల్లల్ని అన్న వన్నూరుస్వామి వద్ద వదిలి భార్యతో కలిసి రెండు నెలల క్రితం బెంగళూరు వలసవెళ్లాడు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరారు. అయితే శుక్రవారం ఓ భవనం వద్ద పనులు చేస్తుండగా నాగరాజు ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రుద్రమ్మ భర్త మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించింది. సమాచారాన్ని ఆయతపల్లి గ్రామంలో కుటుంబసభ్యులకు తెలపడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వాహనంలో బెంగళూరు నుంచి ఆయతపల్లికి తరలించారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఉపాధి పనుల కోసం సూదూర ప్రాంతాలకు వలసలు వెళ్లి అనేక మంది నైపుణ్యం లేని కూలీలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి
చిలమత్తూరు : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన వలస కూలీ మతి చెందాడు. చిలమత్తూరు మండలం పాతచామలపల్లికి చెందిన కె.శ్రీనివాసులు (35), భార్య శివమ్మతో కలిసి పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లాడు. సోమవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులు మతి చెందాడు. -
చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
హిందూపురం రూరల్ : మండలంలోని తూమకుంట పారిశ్రామిక వాడలో తిరుమల స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు జాహ్వాలాన్ ఉపాధ్యాయ్ (50) మతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ అక్బర్ ఆదివారం తెలిపారు. వివరాలు.. శనివారం బిహార్ రాష్ట్రానికి చెందిన జాహ్వాలాన్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తుండగా మూర్ఛ వ్యాధి రావడంతో హిందూపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తోటి కార్మికులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఈక్రమంలో బెంగళూరులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
స్టోన్ క్రషర్స్‌లో బ్లాస్టింగ్.. కార్మికుడి మృతి
గరిడేపల్లి: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేటలో ఓ స్టోన్ క్రషర్స్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. వెంకటసాయి స్టోన్ క్రషర్స్‌లో రాళ్ల బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆర్.నాగేశ్వరరావు అనే కార్మికుడికి రాళ్లు తగిలాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన వాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి
శ్రీరాంపూర్ (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనిలో బుధవారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు చనిపోయాడు. వివరాలు.. శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన ఇరుపు రాఘవులు (39) గనిలోకి మ్యాన్హ్యాండ్లింగ్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పడిపోయాడు. సున్నితమైన ప్రాంతాల్లో బలమైన గాయాలు కావటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, ఆయన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కార్మికులంతా మెరుపు సమ్మెకు దిగారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు కొద్దిసేపటి తర్వాత ఆందోళన విరమించి, విధుల్లోకి చేరారు. -
కరెంట్ షాక్‌తో ఉపాధి కూలీ మృతి
కొండాపూర్ (మెదక్): కరెంటు షాక్‌తో ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలో శనివారం జరిగింది. మండలంలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన సందగల్ల దయానంద్ (38) ఉపాధి పనిలో భాగంగా విద్యుత్ స్తంభం పక్కన గుంత తవ్వుతుండగా షాక్ తగిలింది. దీంతో తోటి కూలీలు దయానంద్‌ను ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. కాగా.. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఏడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.