తాడిపత్రి టౌన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని ఎస్‌జేకే స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్(కార్మికుడు)గా పని చేసే కర్నూలుకు చెందిన షెక్షావలి(40) గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. అవివాహితుడైన షెక్షావలి తాడిపత్రిలో వడ్లపాలెంలో అద్దె ఇంట్లో ఉంటూ కర్మాగారానికి వెళ్లొచ్చేవాడన్నారు.
నరాల బలహీనతో బాధపడేవాడని, ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంటిలో ఉన్న పళంగా కిందపడటంతో రాయిపై తలపడటంతో తీవ్ర గాయమైందన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కర్మాగారంలో కార్మికుడి మృతి
Published Fri, Apr 28 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
Advertisement
Advertisement