వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి | labour dies of sun stroke in dharmavaram | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి

Published Mon, Mar 27 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

ధర్మవరం శాంతినగర్‌లో చెన్న ఆదినారాయణ(53) అనే చేనేత కార్మికుడు వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడని బంధువులు తెలిపారు.

ధర్మవరం అర్బన్ : ధర్మవరం శాంతినగర్‌లో చెన్న ఆదినారాయణ(53) అనే చేనేత కార్మికుడు వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడని బంధువులు తెలిపారు. ఉదయమే ఆరోగ్యం సరిగా లేదని భార్య వెంకటలక్ష్మీకి చెప్పగా, ఆమె వెంటనే ప్రభుత్వాస్పత్రికి పిల్చుకెళ్లినట్లు వివరించారు. అక్కడ చికిత్స చేయించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోనే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి కుమారుడు మురళీ, కుమార్తె శైలజ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement