మండల కేంద్రమైన అమడగూరుకు చెందిన కుటాల నారాయణ (58) అనే కూలీ ఆదివారం బెంగుళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అమడగూరు: అ గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కుటాల నారాయణ కొన్నేళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ వివిధరకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పనులకు వెళ్లే నిమిత్తం నారాయణ ఆదివారం రోడ్డు దాటుతుండగా బీఎంటీసీ సిటీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.