ఎల్‌ఎండీకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు
Published Sat, Aug 6 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
తిమ్మాపూర్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు లోయర్ మానేరు డ్యాంలోకి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ, వరద కాలువ ద్వారా నీటి విడుదలను మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నెల 3న ప్రారంభించారు. అక్కడినుంచి ఎల్‌ఎండీకి నీళ్లు చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ఎల్‌ఎండీలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement