
'రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తేనే పోస్టుమార్టం'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున లారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే, ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని మృతుల బంధువులు రాజమండ్రిలోని ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తేనే తమ వాళ్ల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.