gandepalli
-
కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు
గండేపల్లిలో అక్రమాల తీగ లాగితే.. తొండంగిలో అవినీతి డొంక కదులుతోంది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ముగ్గురు నేతల అండతో.. అమాయక రైతుల కళ్లుగప్పి కోట్లకు పడగలెత్తిన ‘పచ్చ’ నాయకుల పాపం పండుతోంది. సహకార వ్యవస్థను జలగల్లా పీల్చి పిప్పి చేసిన వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గండేపల్లి సహకార సొసైటీలో జరిగిన అవినీతిపై ఓపక్క శాఖాపరమైన విచారణ జరుగుతుండగా.. మరోపక్క లోకాయుక్త కూడా సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో ఈ కుంభకోణం ‘సూత్రధారుల’ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి కార్యకలాపాలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను నష్టాల్లో ముంచేసిన ప్రబుద్ధుల జాతకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి, చంద్రబాబు సర్కార్‌లో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా హయాంలో.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అమాయక రైతులను మోసం చేసి, ‘పచ్చ’నేతలు సాగించిన కోట్ల రూపాయల కుంభకోణం గుట్టు క్రమంగా వీడుతోంది. టీడీపీ పాలనలో డీసీసీబీ పరిధిలోని పలు సహకార సంఘాల్లో జరిగిన కుంభకోణాలను 2019 నవంబర్ నుంచి ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. వీటిపై డీసీసీబీ ప్రస్తుత చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) స్పందించి, విచారణ జరిపించి, పలువురిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. డీసీసీబీ సహా పలు సొసైటీల్లో అవినీతి బాగోతాలపై శాఖాపరంగా విచారణ జరుగుతుండగా.. తాజాగా తొండంగి మండలంలో రైతు రుణాల పేరిట రూ.10 కోట్లు పైనే కొట్టేసిన వారిపై లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో సూత్రధారులైన ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తొండంగిలోనే రూ.10.7 కోట్ల లావాదేవీలు ప్రత్తిపాడు మండలం లంపకలోవ తరువాత ఆ స్థాయిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిన సొసైటీ గండేపల్లి. ఇక్కడ అక్షరాలా రూ.23 కోట్లు అడ్డంగా బొక్కేశారు. అప్పటి టీడీపీ నేత, సొసైటీ ప్రెసిడెంట్ పరిమి బాబు కుటుంబ సభ్యులు మొదలు కారు డ్రైవర్ వరకూ.. ఇలా తెలిసిన వారందరినీ బినామీలుగా సృష్టించి సొమ్ములు దిగమింగారు. దీనిపై ప్రెసిడెంట్ సహా పలువురిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. దీని విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు పలువురిని నివ్వెరపరుస్తున్నాయి. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల మేర కుంభకోణం జరగగా ఇందులో రూ.10.7 కోట్ల బినామీ రుణాలు తొండంగి సొసైటీ కేంద్రంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కార్‌లో అన్నీ తానుగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడి సొంత మండలం తొండంగి చుట్టూ ఈ కుంభకోణం తిరగడం గమనార్హం. తొండంగి మండలమే ఎందుకంటే.. అసలు గండేపల్లి సొసైటీకి, తొండంగి సొసైటీలోని రైతులకు లింకేమిటి? అక్కడి రైతులకు రుణాలివ్వాలనే మంచి మనస్సు ‘పచ్చ’ నేతలకు ఎందుకు వచ్చిందని విచారణ చేసిన సహకార అధికారులకు నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కట్టాయి. పక్కా ప్లాన్ ప్రకారమే బినామీ రుణాలు నొక్కేయడానికే టీడీపీ నేతలు తొండంగి మండలాన్ని ఎంపిక చేసుకున్నారని రైతులు చెబుతున్నారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడితో నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు బలమైన బంధమే ఉండేది. రాజా రాజకీయ ఎదుగుదలకు యనమల అండదండలు దండిగా ఉండేవి. అప్పట్లో ఇద్దరూ అధికారంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణం మూలాలు తొండంగి మండలంలో వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల పాత్రపై అక్కడి రైతుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గండేపల్లి సొసైటీ రుణ జాబితా ఆధారంగా జరుపుతున్న విచారణలో ఒక్క తొండంగి మండలంలోనే ఎక్కువ మంది బినామీ పేర్లతో సొమ్ములు దిగమింగిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతలకు అప్పట్లో అధికార బలం ఉండడంతో తొండంగి మండలంలో ఈ రుణాలతో సంబంధం లేని అమాయక రైతుల పేర్లతో జాబితా రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు. తొండంగిలోనే 59 మంది బినామీలు ఈ కుంభకోణానికి సంబంధించి తుని నియోజకవర్గంలో 61 మంది బినామీ రైతుల పేర్లు లెక్క తేల్చగా, వీరిలో తొండంగి మండలంలోనే 59 మంది ఉన్న విషయం డివిజనల్ సహకార అధికారి డీఆర్ రాధాకృష్ణ ప్రాథమిక విచారణలో తేలింది. తొండంగి సొసైటీ సభ్యులుగా తేలి్చన 61 మందిలో 13 మంది మాత్రమే నిజమైన వారు. మిగిలిన వారి అడ్రస్‌లే ఆ సొసైటీలో లేకపోవడం విచారణాధికారులను విస్మయానికి గురి చేసింది. ముఖ్య నేతల ‘సహకారం’ లేకుండా తొండంగి మండలంలో ఇంతటి కుంభకోణానికి ఆస్కారమే ఉండదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణుడు, వారి ముఖ్య అనుచరుడైన పోల్నాటి శేషగిరిరావు కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చనిపోయిన రైతులు, సొసైటీ సభ్యులు కాని రైతుల పేర్లతో నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేయడమే కాకుండా వాటిని తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్గేజ్ కూడా చేయించినట్టు ప్రాథమిక సమాచారం. ఇటువంటి పనులు సామాన్యుల వల్ల కాదని, అప్పటి టీడీపీ నేతల హస్తం లేకుండా ఇదంతా జరగదని అంటున్నారు. 36 మంది రైతులను విచారించగా వారిలో ఏడుగురు అసలు బతికే లేకపోవడం గమనార్హం. అంతమంది అమాయక రైతుల పేర్లపై పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు సృష్టించడం వెనుక కచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల ప్రమేయం ఉంటుందని అంటున్నారు. విచారణ పూర్తయ్యేసరికి ఈ కుంభకోణంలో మరింత మంది ‘పచ్చ’ నేతల బండారాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: విషాదం: అమ్మకు తోడుగా వచ్చి.. మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్ -
వేట మొదలైంది... వేటు పడింది..
అన్నదాతలకు మేలు చేసే సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను.. సకుటుంబ సపరి‘వాటం’గా దోచుకున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు డీసీసీబీ పాలకవర్గం కొరడా ఝళిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సొసైటీలకు అణువణువునా పట్టిన అవినీతి చీడను వదిలిస్తోంది. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణంలో ఇద్దరు అధికారులపై వేటు వేసింది. మిగిలిన వారి కోసం వేట కొనసాగిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: గత టీడీపీ పాలనలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(సొసైటీలు) నిధులను కొంతమంది అక్రమార్కులు పీల్చి పిప్పి చేశారు. బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు కొట్టేసి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి, రైతులను నిలువునా ముంచేశారు. డీసీసీబీతో పాటు సొసైటీల్లో కూడా ‘పచ్చ’నేతలు సొసైటీ ప్రెసిడెంట్ల ముసుగులో తిష్ట వేసి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ అవినీతి బాగోతాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పాలకవర్గం ఆ అవినీతిపరుల భరతం పడుతోంది. రైతులకు చెందాల్సిన సొమ్మును యథేచ్ఛగా దోచుకున్న వారితో కుమ్మక్కయిన అధికారులపై వేటు మీద వేటు వేస్తోంది. టీడీపీ హయాంలో గండేపల్లి సొసైటీలో అప్పటి ప్రెసిడెంట్ తన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు తయారు చేసి రూ.23 కోట్లు కాజేసిన విషయాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో బయట పెట్టింది. గత సెప్టెంబర్ 24న ‘‘ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లు పైమాటే’’, అక్టోబరు 6న ‘‘సకుటుంబ సపరి‘వాట’ంగా’’, నవంబరు 3న ‘‘రాబంధువుల లెక్కల చప్పుడు’’ శీర్షికలతో గండేపల్లి సొసైటీలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని బట్టబయలు చేసింది. వీటిపై స్పందించిన డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ డీసీ సీబీ డీజీఎంలు కె.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీధర్‌చౌదరి ఆధ్వర్యాన రెండు నెలల పాటు విచారణ చేసి, జరిగిన అవినీ తి నిగ్గు తేల్చారు. ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తున కు సహకార రంగంలో కీలక మైన 51 విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ కుంభకోణంలో ప్రాథమికంగా బాధ్యులుగా తేలిన గండేపల్లి సొసై టీ ప్రస్తుత మేనేజర్ ఆర్.శ్యామల, గతంలో ఇక్కడ పని చేసి ప్రస్తుతం కొత్తపేటలో పని చేస్తున్న మేనేజర్ హెచ్ ఎస్ గణపతిలపై అనంతబాబు ఆదేశాల మేరకు డీసీసీ బీ సీఈఓ ప్రవీణ్‌కుమార్ స స్పెన్షన్ వేటు వేశారు. వీరితో పాటు విచారణలో బాధ్యులు గా గుర్తించిన డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ డీవీ సూర్యం, లీగల్ అధికారులు త్రినాథ్, ఎ.శ్రీనివాసరావుతో పాటు రిటైరైన మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. వీరిపై కూడా త్వరలో వేటు పడే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో ఆ సొసైటీతో పాటు, డీసీసీబీ బ్రాంచిలో పని చేస్తున్న వారి పాత్ర ఏమేరకు ఉందో నిగ్గు తేల్చే పనిలో డీసీసీబీ వర్గాలున్నాయి. చదవండి: (దేవుళ్లకే శఠగోపం!) రికవరీ సవాలే.. ఈ అవినీతి బాగోతానికి తెర వెనుక సహకరించిన వారిపై వేటు వేసిన డీసీసీబీ.. చంద్రబాబు హయాంలో రూ.23 కోట్లు దారి మళ్లించిన సొసైటీ అధ్యక్షుడు పరిమి బాబు సహా ఇతరుల నుంచి సొమ్ము రికవరీ చేయాల్సి ఉంది. ఈ పని డీసీసీబీకి పెద్ద సవాల్ కానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గండేపల్లి సొసైటీలో 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఇచ్చిన రుణాల్లో సుమారు రూ.23 కోట్లను అధ్యక్షుడు, తన బంధువర్గం పేరిట మంజూరు చేసుకుని దారి మళ్లించేశారు. సొసైటీలో 155 మంది పేర్లతో రూ.22.83 కోట్ల రుణాలు మంజూరైతే సింహభాగం అప్పటి సంఘం అధ్యక్షుడి కుటుంబ సభ్యులు, సంఘం సీఈఓ, సిబ్బంది ఖాతాలకు జమ అవడాన్ని ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ అనంతబాబు తీవ్రంగా పరిగణించారు. విచారణను నీరుగార్చి, అవినీతిపరులను కాపాడేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను కూడా చైర్మన్ తిప్పికొట్టారు. చదవండి: (టీడీపీ హయాంలో విచ్చలవిడి అవినీతి) చంద్రబాబు హయాంలో నొక్కేసిన కోట్లాది రూపాయలు తిరిగి రాబట్టేందుకు డీసీసీబీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అప్పట్లో సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన పరిమి సత్యనారాయణ (బాబు) రూ.7.13 కోట్లు, ఆయన భార్య వెంకట సత్య మంగతాయారు రూ.1.08 కోట్లు, ఆయన బంధువు పి.కృష్ణ శ్రీనివాస్ రూ.6.76 కోట్లు, సీఈ ఓ పి.సత్యనారాయణ రూ.53.92 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ జి.సత్యనారాయణ రూ.7.85 లక్షలు, సబ్ స్టాఫ్ వెంకటలక్ష్మి రూ.2 లక్షలు, పరిమి బాబు కారు డ్రైవర్ సత్యనారాయణ రూ.4 లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీహరి రూ.4 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్ కనకరాజు రూ.5.90 లక్షలు, డ్రైవర్ భార్య పేరిట రూ.2 లక్షలు బదిలీ చేసినట్టు ఈ కుంభకోణంపై విచారణ చేస్తున్న అధికారులు లెక్క తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా సోమన కిశోర్‌బాబుకు రూ.44.54 లక్షలు, చల్లాప్రగడ సత్య నాగ భాస్కర్ శ్రీనివాసరావుకు రూ.43 లక్షలు, మదడ శ్రీనివాసుకు రూ.42.09 లక్షలు ఇచ్చినట్టు తేల్చారు. వారి నుంచి ఈ సొమ్మును ఎలాగైనా రికవరీ చేయాలని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనిపై డీసీసీబీ కసరత్తు చేస్తోంది. ఒక కుటుంబం స్వార్థంతో అవినీతికి పాల్పడి గండేపల్లి సొసైటీని నష్టాల్లోకి నెట్టేసింది. దీంతో ఆ సొసైటీ పరిధిలోని రైతులకు రుణాలు అందకుండా పోయాయి. ఇప్పుడు కొత్తగా రుణాలు ఇవ్వాలన్నా సొసైటీలో అవకాశం లేకుండా చేశారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును ఎప్పటికి రాబడతారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరినీ విడిచిపెట్టేది లేదు సహకార వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు ఎంతటి వారై నా విడిచిపెట్టేది లేదు. వారు ఏ పార్టీలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే లేదు. గండేపల్లి సొసైటీలో బినామీ పేర్లతో కోట్ల రూపాయలు స్వాహా చేసి, రైతులను తీవ్రంగా దెబ్బ తీసిన ప్రెసిడెంట్ పరిమి బాబు నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టేందుకు ఉన్న ఏ మార్గాన్నీ డీసీసీబీ విడిచిపెట్టదు. టీడీపీ హయాంలోని సొసైటీ పాలకవర్గాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసిన వారందరి జాతకాలూ బయట పెడతాం. గండేపల్లి సొసైటీలో బయటపడిన రూ.23 కోట్ల కుంభకోణంతో పాటు మిగిలిన సొసైటీల అవినీతి వ్యవహారాలను కూడా సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను. ఈ అవినీతి బాగోతంతో గండేపల్లి సొసైటీ పూర్తిగా నష్టాల్లోకి పోయింది. సొసైటీ పరిధిలోని గండేపల్లి, ఎన్టీ రాజాపురం, రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లోని 934 మంది సభ్యులకు రుణాలివ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు. కొత్త సభ్యులను చేర్చుకున్నా వారికి కూడా రుణాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. – అనంత ఉదయభాస్కర్, డీసీసీబీ చైర్మన్ -
అక్రమాలు చేసి.. ముఖం చాటేశారు..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి, అక్రమాలపై విచారణకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార అధికారులు కదిలారు. అక్రమాలకు సంబంధించిన రికార్డులు తారుమారు కాకుండా చూసేందుకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు శుక్రవారం వారు ప్రయత్నించారు. సొసైటీ సిబ్బంది సహకరించకపోవడంతో చివరకు సొసైటీ భవనాన్ని, అందులో కీలకమైన రికార్డులు ఉన్న బీరువాలను సీజ్ చేశారు. బినామీ పేర్లు, నకిలీ డాక్యుమెంట్లతో గండేపల్లి సొసైటీలో కొంతమంది ప్రబుద్ధులు రూ.23 కోట్లు కొల్లగొట్టిన కుంభకోణంపై.. డీసీసీబీలోని ఇద్దరు డిప్యూటీ జనరల్ మేనేజర్లతో చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీని నుంచి ఏదో ఒకలా బయట పడదామనుకుంటున్న సూత్రధారులు విచారణ ముందుకు సాగకుండా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రికార్డులను మాయం చేసే ప్రయత్నాలకు బుధవారమే తెర తీశారు. తొలిగా సొసైటీలో సిబ్బందిని అందుబాటులో లేకుండా చేశారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకూ సొసైటీలో 156 మంది బినామీ పేర్లు, నకిలీ బాండ్లతో విడుదల చేసిన రుణాల రికార్డుల కోసం విచారణాధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. విచారణ కోసం సొసైటీ కార్యాలయానికి వెళ్లేసరికి సిబ్బంది ముఖం చాటేయడంతో వారు అవాక్కయ్యారు. శుక్రవారం సొసైటీ వద్దకు వెళ్లగా రికార్డులు, కార్యాలయంలోని బీరువాల తాళాలు కూడా అందుబాటులో లేవనే సమాధానం వారికి ఎదురైంది. తద్వారా విచారణను అడ్డుకునేందుకు అక్రమార్కులు ఎత్తు వేశారు. సొసైటీలోని బీరువాల్లో ఉన్న రికార్డులను మార్చేసే ప్రయత్నం కూడా జరుగుతోందని స్థానికులు డీసీసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనించిన డీసీసీబీ అధికారులు అక్రమార్కుల ఎత్తులకు పై ఎత్తులు వేశారు. విచారణ ముందుకు సాగాలంటే రికార్డులు తారుమారు కాకుండా చూడాలని, ప్రధాన ఆధారాలుగా భావిస్తున్న 156 మంది రైతుల పేర్లతో నమోదై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసే వరకూ సొసైటీలోని రికార్డులను భద్రంగా ఉంచాల ని జిల్లా సహకార అధికారి పాండురంగారావును డీసీసీబీ చైర్మన్ అనంతబా బు కోరారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు పెద్దాపురం, ప్రత్తిపా డు సబ్ డివిజన్ల సహకార అధికారులు బీఎన్ శివకుమార్, శివకామేశ్వరరావు లు గండేపల్లి సొసైటీకి వెళ్లారు. సిబ్బందిని రికార్డుల గురించి అడగగా వారు ఇవ్వలేదు. అటెండర్‌కు కరోనా వచ్చినందు వల్ల తాళాలు లేవని చెప్పారు. వారి మాటలను విశ్వసించని అధికారు లు రికార్డులు ఉన్న మూడు బీరువాల తో పాటు, గండేపల్లి సొసైటీ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. డీసీసీబీ జారీ చేసిన నోటీసులను సొసైటీ ప్రధాన ద్వారం తలుపులపై అతికించారు. ఈ అక్రమాలపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని డివిజనల్ సహకార ఆఫీసర్ రాధాకృష్ణ తెలిపారు. అక్రమార్కుల నుంచి ప్రతి పైసా తిరిగి రాబట్టే వరకూ విశ్రమించేది లేదన్నారు. బాధ్యులుగా తేలిన వారిపై సహకార చట్టం ప్ర కారం చర్యలు తప్పవన్నారు. విచారణ ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే పోలీసుల సాయం కూడా తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్‌ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. – ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
వాటర్ కాదు పెట్రోలే..
సాక్షి, గండేపల్లి (తూర్పు గోదావరి): పెట్రోలు కోసం బంక్‌కు వెళ్లిన ఆ వాహనదారులు షాక్ తిన్నారు. పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మల్లేపల్లి శివారున ఉన్న శ్రీధాత్రీ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీ) పెట్రోల్ బంకులో తాళ్లూరుకు చెందిన ఆరుగొల్లు పండు, రైతులు, మల్లేపల్లి, ఇతర గ్రామాలకు చెందిన వాహనదారులు తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. ఆస్పత్రి నిమిత్తం రాజానగరం వెళుతున్న పండు వాహనం బంక్‌కు కొంత సమీపంలో నిలిచిపోయింది. వాహనంలో ఉన్న పెట్రోల్‌ను సీసాలోకి నింపి బంకు వద్దకు చేరుకున్న వినియోగదారులు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సీఐ ఎన్ రమేష్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు అక్కడికి చేరుకుని వినియోగదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ తనిఖీకి సంబంధించిన వ్యక్తి అందుబాటులో లేనందున ప్రస్తుతానికి పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించినట్టు తెలిపారు. జరిగిన విషయంపై వివరాలు నమోదు చేసుకున్నామని తదుపరి చర్యలు తనిఖీ అనంతరం ఉంటాయని రెవెన్యూ అధికారి జి.కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించామని తనిఖీ నిర్వహించేంత వరకు ఒక వ్యక్తిని బంక్ వద్ద ఉంచనున్నట్టు వెల్లడించారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. పెట్రోల్ ఉండే రసాయనపదార్థం వల్లే నీరులా తేలిందని బంక్ నిర్వాహకులు, అధికారులు చెబుతున్నారు. అనుమానం వచ్చిన వినియోగదారులు వాహనంలో పోయించిన పెట్రోల్‌ను సీసాల్లో మార్చడంతో సీసా అడుగు భాగంలో నీరు, పైభాగంలో పెట్రోల్ తేలడంతో అధికారులు, పెట్రోల్ కోసం వచ్చిన ఇతర వినియోగదారులు అవాక్కయ్యారు. ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని, అయినా బంక్ నిర్వహణలో మార్పు రావడం లేదని వినియోగదారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. -
వికటించిన ఇంజక్షన్..
సాక్షి, గండేపల్లి (తూర్పు గోదావరి): పసిపిల్లలకు అంటువ్యాధులు సోకకుండా ఉండేందుకు వేసే టీకా వికటించడంతో ఐదు నెలల పసిబాలుడు అపస్మారకస్థితికి చేరుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని నీలాద్రిరావుపేటకు చెందిన నల్లమిల్లి రమేష్, సుశీల దంపతులకు ఐదు నెలల క్రితం బాలుడు (కార్తీక్) జన్మించాడు. ప్రతినెలా ఆరోగ్య కార్యకర్తల సూచనల మేరకు పోలియో చుక్కలు, వ్యాధినిరోధక టీకాలు వేయిస్తున్నారు. ఈనెల 17న గ్రామీణ ప్రాంత సబ్సెంటర్కు బాలుడుని తీసుకువెళ్లగా ఆరోగ్య కార్యకర్తలు యథావిధిగా ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అర్ధగంటలో పసిబాలుడులో మార్పుచోటు చేసుకుని ఏడుపు మానకపోవడంతో తల్లిదండ్రులు ఆరోగ్య కార్యకర్తలను నిలదీశారు. ఇంజక్షన్ సరిగా చేయలేదని అడగడంతో ఎప్పటిలానే చేశామని సర్దిచెప్పారు. బాలుడు ఆరోగ్య పరిస్థితి సాయంత్రానికి క్షీణించడంతో బంధువులు, చుట్టు పక్కలవారు ఆక్రందనతో ఆందోళన చెందారు. పరిస్థితి విషమించడంతో జగ్గంపేట ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు బాలుడు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తీసుకువెళ్లాలని చెప్పడంతో హుటాహుటిన బాలుడిని రాజమహేంద్రవరం వైద్య నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల అనంతరం ఆదివారం సాధారణ గదికి తరలించి వైద్యం అందిస్తున్నారని ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలుడు ఆస్పత్రి పాలయ్యాడని గ్రామస్తులు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంజక్షన్ వల్ల ఇలా జరగలేదని బాలుడుకి ఇన్ఫెక్షన్ ఉండటవల్ల ఇలా అయ్యిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. -
కారు అదుపుతప్పి.. అనంతలోకాలకు
- ఇద్దరికి తీవ్ర గాయాలు - త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు గండేపల్లి (జగ్గంపేట) : ఏడీబీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయపడ్డారు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి ప్రమాదం త్రుటిలో తప్పింది. స్థానిక ఎసై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళానికి చెందిన యవ్వారి మనోజ్‌కుమార్ (21), అనకాపల్లికి చెందిన రవిరాజు ఈఈఈ ఫైనల్ ఇయర్, రాజోలుకు చెందిన కంచి కౌశిక్ మెకానికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. పెద్దాపురం బ్యాంక్ కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ కళాశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. సోమవారం రవిరాజుకు చెందిన కారులో స్నేహితుడైన కౌశిక్‌ను కళాశాలలో డ్రాప్ చేసేందుకు కళాశాల సమీపంలోకి వచ్చి వెనుదిరిగి పెద్దాపురం బయలుదేరారు. లలిత గొడౌన్ వద్దకు వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలోంచి దూసుకెళ్లి గొడౌన్ గేట్ వద్ద చెట్టును, పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షెల్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ముగ్గురు కారులో చిక్కుకుపోయారు. గొడౌన్‌కు చెందిన పలువురు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. అప్పటికే మనోజ్‌కుమార్ మృతి చెందినట్టు అంబులెన్స్ సిబ్బంది తెలిపింది. తీవ్ర గాయాలతో ఉన్న రవిరాజు, కౌశిక్‌లను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఏఎస్సై వరహాలరాజు వివరాలు సేకరించారు. ప్రస్తుతం రవిరాజు పరిస్థితి విషమంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భీతిల్లిన సిబ్బంది షెల్టర్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. ఈ ప్రమాదంతో భీతిల్లారు. ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. షెల్టర్‌ను కారు ఢీకొనడంతో తమకు ప్రమాదం తప్పిందని పడాల శ్రీనివాస్, మద్దాల విలియం తెలిపారు. కారణం.. అతివేగమా? రోడ్డుపై బురదేనా? విద్యార్థులు ప్రయాణం చేస్తున్న కారును వేగంగా నడపడంతో ఈ ప్రమాదం సంభవించిందా...లేక రోడ్డుపై బురద కారణమా అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లోనే రోడ్డు నునుపుగా ఉంటుందని, వర్షం పడడం, ఈ రహదారిలో గ్రావెల్‌ను తరలిస్తున్న లారీ డ్రైవర్లు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రోడ్డుపై గ్రావెల్ పడుతోందని అంటున్నారు. దీంతో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. మనోజ్ కుమార్ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కాకినాడలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. -
లారీ డ్రైవర్ ఏమరుపాటు...
వ్యాన్ డ్రైవర్‌కు గ్రహపాటు రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గండేపల్లి : డ్రైవర్ ఏమరపాటు వల్ల జరిగిన ప్రమాదంలో మరో వాహన డ్రైవర్ మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలివి...శుక్రవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ గండేపల్లి, మల్లేపల్లి గ్రామాల మధ్యకు వచ్చేసరికి డ్రైవర్ తన లారీని సడన్‌గా ఆపడంతో వెనకే వస్తున్న హైషర్ వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయి డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు, సిబ్బంది ప్రసాద్, అచ్చిరాజు, ఇ.బి.రావు తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకుతీసి పోలీస్ వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో అందుబాటులోకి వచ్చిన 108 అంబులెన్స్‌లోకి క్షతగాత్రుడిని మార్చి తరలించారు. మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వాహనాల తనిఖీ అధికారులు ఉండటంతో హఠాత్తుగా గమనించిన డ్రైవర్ (ప్రమాదానికి కారణమైన లారీ) తన లారీని సడన్‌బ్రేక్ వేసి ఆపడంతో వెనుక వస్తున్న వ్యాన్ లారీని ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. -
అగ్గి రగిలింది
► జ్యోతుల వర్గంపై జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగుబాటు ►టీడీపీ పదవులకు గండేపల్లి మండలాధ్యక్షుడి రాజీనామా ► ఫలించని నెహ్రూ వర్గీయుల దౌత్యం ► ఇప్పటికే దూరమైన పలువురు నేతలు ►రాజీనామాల పరంపరతో ‘దేశం’లో అలజడి రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి. ఈ సామెత మెట్ట ప్రాంతంలో సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విషయంలో ఇప్పుడు నిజమవుతోంది. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన.. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీని వంచించి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా జిల్లా రాజకీయాలను శాసించేవారు. అటువంటి నాయకుడికి వ్యతిరేకంగా ఇప్పుడు సొంత పార్టీలో.. సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి అగ్గి రగిలింది. ఈ పరిణామాలు ఆయన వర్గాన్ని చివరకు ఏ తీరానికి చేరుస్తుందా అనే చర్చ మెట్ట రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆదినుంచీ తెలుగుదేశం పార్టీ విధేయుడిగా ఉన్న గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతుల మోహనరావు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన జ్యోతుల నెహ్రూ వర్గం.. తమకు కనీస మర్యాద, ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వగ్రామం సింగరంపాలెంలో రాజీనామా విషయాన్ని మోహనరావు ప్రకటించారు. పార్టీ మండల అధ్యక్ష పదవితోపాటు, వైఎస్ ఎంపీపీ, మండల స్థాయి జన్మభూమి కమిటీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. తద్వారా పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలియజేశారు. ఆయనకు సంఘీభావంగా సూరంపాలెం గ్రామానికి చెందిన కుంచే వెంకటస్వామి, ఎన్టీ రాజాపురానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంటిపూడి సత్యనారాయణ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ కూడా నెహ్రూతో రాజకీయంగా పొసగని ఒకప్పటి జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులే కావడం గమనార్హం. దీనినిబట్టి నెహ్రూ ‘సైకిల్’ ఎక్కాక.. చంటిబాబు వర్గంగా ముద్రపడ్డ నేతలను ఒక పథకం ప్రకారమే పార్టీకి దూరం చేస్తున్నట్టు కనిపిస్తోందని టీడీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఒక్కపనీ చేయించుకోలేకపోతే ఇంకెందుకు? కార్యకర్తగా ఉన్నప్పుడే తన గ్రామానికి రెండు మూడు రోడ్లు వేయించుకున్న తాను మండల స్థాయిలో క్రియాశీలక పదవిలో ఉన్నా ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నానని మోహనరావు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఒకరిద్దరికి కూడా గృహ నిర్మాణ రుణాలు, పింఛన్లు మంజూరు కాకుండా ప్రత్యర్థులు మోకాలడ్డుతున్నారని ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది పొమ్మనకుండానే పొగబెట్టడం కాక మరేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను కేవలం కూరలో కరివేపాకులుగా వినియోగించుకుని విసిరికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండేపల్లి మండలంలో కోర్పు లచ్చయ్యదొర ఏం చెబితే అది చేసుకుంటూపోతే ఇక పార్టీ మండల అధ్యక్ష పదవిలో ఉండి ఉపయోగమేమిటని పోతుల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవ విగ్రహంలా ఉండేæ ఈ పదవులు ఎందుకనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు. ఫలించని నెహ్రూ యత్నాలు మోహనరావు సహా ఇతర నేతలు రాజీనామాకు సిద్ధపడుతున్నారనే విషయం తెలియడంతో వారిని బుజ్జగించేందుకు రెండు రోజులుగా నెహ్రూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నెహ్రూ ముఖ్య అనుచరులు అత్తులూరి సాయిబాబా, మంతెన నీలాద్రిరాజులు జరిపిన దౌత్యం కూడా బెడిసికొట్టిందనే చెబుతున్నారు. 48 గంటల్లో సర్దుబాటు చేస్తామని పలువురు నేతలు రాజీ‘డ్రామా’ నిర్వహించినా వెనక్కు తగ్గేది లేదని మోహనరావు తదితరులు తెగేసి చెప్పారు. ఒకవేళ రాజీనామాలపైæ ఇప్పుడు వెనక్కు తగ్గినా.. ఎనిమిది నెలలుగా ఎదురవుతున్న అవమానాలు భవిష్యత్తులో రెట్టింపు అవుతాయని ఆ వర్గం ఆందోళన చెందుతోంది. మంగళ, బుధవారాల్లో వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా లేఖను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేసేందుకు మోహనరావు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నా కంటిసైగతో రాజకీయాన్ని నడిపించిన నెహ్రూ.. సొంత నియోజకవర్గంలో రాజుకున్న అసంతృప్తి కుంపటిని ఆర్పలేకపోవడం చూస్తే.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. దూరదూరంగా చంటిబాబు మరోపక్క నెహ్రూ వర్గీయుల ఆధిపత్య రాజకీయాలతో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్, నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు టీడీపీ కార్యకలాపాలకు దాదాపు దూరమయ్యారు. జగ్గంపేటలో సీనియర్ నాయకుడు కర్రి శ్రీను అసంతృప్తితో ఆదివారమే రాజీనామా చేశారు. గోకవరం మండలం తంటికొండ ఎంపీటీసీ సభ్యురాలు ముర్ల నాగలక్ష్మి.. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇటీవల రాజీనామాకు సిద్ధపడగా.. ఆమెను మాత్రం ఎలాగోలా బుజ్జగించి ఆపగలిగారు. నెహ్రూ చేరికతో రాజుకున్న మూడో కుంపటి నెహ్రూ టీడీపీలోకి రాక పూర్వం జగ్గంపేట నియోజకవర్గంలోని ఆ పార్టీలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు వర్గాలుండేవి. నెహ్రూ టీడీపీలోకి వచ్చాక మూడో కుంపటి రాజుకుంది. ఈ మూడు కుంపట్ల మ«ధ్య మండలస్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎలాగోలా సాగనంపేందుకు పొమ్మనకుండానే పొగ పెడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా.. గండేపల్లి : ‘‘టీడీపీ ఆవిర్భావం నుంచీ కార్యకర్తగా ఎన్నో పనులు చేయించుకోగలిగాను. నా గ్రామంలో ఎన్నో పనులు చేయించాను. అధికార పార్టీకి మండల అధ్యక్షుడిని. మండల పరిషత్ ఉపాధ్యక్షుడిని. ఇలా రెండు కీలకమైన పదవులున్నా.. సొంత ఊళ్లో పనులు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను. నా వీధిలో కూడా వేరేవారు పనులు చేపడుతున్నారు. దీనిపై పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాను. అయినా ప్రయోజనం లేదు. కొద్ది నెలలుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేరే పార్టీకి పోవడంతో అప్పటినుంచీ ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చాను. అప్పగించిన బాధ్యతలను భుజాలపై వేసుకుని నమ్మకంగా పని చేశాను. ఇప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాను. అధికారులు, నాయకులూ నా మాట పట్టించుకోవడం లేదు. అందుకే వైస్ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్ష పదవి, జన్మభూమి కమిటీ సభ్యుడి పదవి, ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నాను’’ అని మండలంలోని టీడీపీ సీనియర్ నాయకుడు పోతుల మోహనరావు ఆవేదనతో చెప్పారు. స్వగ్రామం సింగరంపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ పదవుల రాజీనామా విషయాన్ని జెడ్పీ సీఈఓకు తెలియజేస్తానని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని, పదవులకు మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన కొందరు నాయకులు మాట్లాడుతూ, రాజీనామా విషయంపై పునరాలోచన చేయాలని, కొద్ది సమయం ఇవ్వాలని కోరారు. ఈలోగా నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి భర్త బాబ్జీ, సొసైటీ అధ్యక్షులు పాలకుర్తి ఆదినారాయణ, బొడ్డు సత్తిరాజు, సర్పంచ్‌లు బొండా శ్రీనుబాబు, పైణ్ని వెంకటేశ్వరరావు, మూలయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి వైపు వెళ్తున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గండేపల్లి పట్టణానికి చెందిన నిమ్మలపూడి వినోద్( 18), నిమ్మలపూడి ప్రసాద్(43) గా గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమండ్రి ఆస్పత్రిలో శవ రాజకీయాలు
-
రాజమండ్రి ఆస్పత్రిలో శవ రాజకీయాలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'శవ' రాజకీయాలకు తెర తీసింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...రాజమండ్రి వస్తున్నారన్న సమాచారం తెలిసి గండేపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను హడావుడిగా స్వస్థలాలకు తరలింపు చేపట్టింది. సోమవారం తెల్లవారుజామున గండేపల్లి వద్ద బూడిద లారీ బోల్తా పడిన సంఘటనలో 19మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్ జగన్... మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి బయల్దేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మృతదేహాలను తరలింపు ఆదేశించింది. అయితే మృతి చెందినవారికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాలను తరలిస్తామని మృతుల బంధువులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రి నుంచి తరలించాలని ఆదేశించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
'రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తేనే పోస్టుమార్టం'
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున లారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే, ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని మృతుల బంధువులు రాజమండ్రిలోని ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తేనే తమ వాళ్ల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
పోలీసుల మాట వినుంటే..
గండేపల్లి ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సోమవారం పోలీసులకు లొంగి పోయాడు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద లారీ డ్రైవర్ జోగా శ్రీను లొంగి పోయినట్లు సమాచారం. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా 35మందిని ఎక్కించుకొని మితిమీరిన వేగంతో లారీని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీని అదుపుచేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయిన విషయం తెలిసిందే. డ్రైవర్ క్లీనర్లిద్దరూ విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్తపోలవరం వాసులు. కాగా డ్రైవర్ పీఎస్ లో లొంగిపోగా, క్లీనర్ పరారీలోనే ఉన్నాడు. ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. కొద్దిరోజు క్రితం పనుల కోసం చింతలపూడి వెళ్లిన వలస కూలీలు.. రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. చింతలపూడి నుంచి ఏలూరుకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు రాత్రి 11గంటల సమయంలో ఏలూరు బైపాస్ వద్ద 35మంది కూలీలు లారీ ఎక్కారు. ప్రమాదానికి సరిగ్గా గంట ముందు... లారీని పోలీసులు ఆపారు. అధిక లోడుతో వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అయినా డ్రైవర్ వినిపించుకోలేదు. పోలీసుల మాట వినుంటే ఇంత ఘోరం జరిగుండేది కాదు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 16మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15మంది గాయపడినట్లు సమాచారం. వారందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుప్రతికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
గండేపల్లి మృతుల వివరాలు
తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంంలో 16 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో.. పత్తిపాడు మండలం యూ.జె పురానికి చెందిన 1.గాజు. త్రినాథ్, 2.గాజు. దొరబాబు, 3.కడిమి. సూరి, 4.కడిమి సురేశ్, 5.దొడ్డిపట్ల. శివకృష్ణ, 6.గొల్లపల్లి. సత్యనారాయణ, 7.సత్తా రాంబాబు, 8.గాలి వెంకన్న, 9.గార్ల సూరిబాబులు ఉన్నారు. రౌతులపాడు మండలం శృంగవరం గ్రామానికి చెందిన 10.ఈగల నాగబాబు, 11.గొల్లపల్లి దొరబాబు, 12.పసుకుర్తి శివకృష్ణ, 13.కొల్లి బాబ్జిలు, 14.దార్ల తొండబాబు ఈ ఘోర దుర్ఘటనలో దుర్మరణం చెందారు. అలాగే, తొండంగి మండలం 15. సూరిబాబు, శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన 16.పురం దాసు వీరబాబులు అక్కడికక్కడే మృతి చెందారు. -
పుష్కర విషాదం
మ్యాజిక్ వ్యాన్ బోల్తా : ఇద్దరి మృతి గండేపల్లి : మల్లేపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మ్యాజిక్ వాహనంలో రాజమండ్రి నుంచి తిరుగు ప్రయాణంలో మల్లే వద్దకు వచ్చేసరికి తూమును వేగంగా ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన మీసాల సత్యం (60) కేబిన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. వెనుక కూర్చున్న విజయనగరం జిల్లా పినపరిణికి చెందిన సుంకి సోములు (35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కంది కృష్ణమోహన్, ఆల్తి శివ, లంక అప్పలనాయుడు, ఆల్తీ నవీన్, బొత్స వెంకటపద్మావతి, గేది సత్యనారాయణ, మజ్జి సంతోష్, మీసాల సరస్వతి, ఆల్తీ రాము గాయపడ్డారు. ఆటోలో చిక్కుకున్న వీరిని స్థానికులు రక్షించారు. వీరిలో అప్పలనాయుడు, మరో మహిళ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. క్షతగ్రాతులను హైవే అంబులెన్స్‌లో రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలిసింది. డ్రైవర్ అక్కడ నుంచి పరారైనట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎన్.రజనీకుమార్ సందర్శించికేబిన్లోని సత్యం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను ఢీకొన్న వ్యాన్ : భర్త మృతి పి.గన్నవరం : పుష్కర స్నానం చేసి మోటార్ సైకిల్‌పై తిరిగి వస్తున్న దంపతులను వ్యాన్ ఢీ కొట్టడంతో భర్త అక్కడిక్కడే మృతి చెందగా, భార్య గాయాలపాలైంది. ఈ సంఘటన మండలంలోని ఊడిమూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై వీరబాబు కథనం ప్రకారం యర్రంశెట్టి వారి పాలెం గ్రామానికి చెందిన కొండేటి నాగేశ్వరరావు (55), అతడి భార్య సత్యవతి ఉదయం మోటారు సైకిల్‌పై రావులపాలెం పుష్కర స్నానానికి వెళ్లారు. అక్కడ పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా ఊడిమూడి వద్ద రావులపాలెం వైపు వెళ్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. నాగేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య సత్యవతికి తీవ్ర గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావు మృతదేహానికి అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతు డి కుమారుడు సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. నాగేశ్వరరావు మృతితో యర్రంశెట్టివారి పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పుష్కర స్నానానికి వెళుతూ మహిళ మృతి పాశర్లపూడి(మామిడికుదురు) : పుష్కర స్నానానికి సోంపల్లి వెళ్తున్న సలాది వెంకటలక్ష్మి(45)ని వెనుక నుంచి వచ్చిన అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందింది. స్థానిక గుబ్బలవారి మెరకలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కరప మండలం వేములవాడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి బెంగుళూరులో ఉంటోంది. అక్కడి నుంచి స్వగ్రామం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమలాపురంలో బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులంతా కలిసి రెండు మోటార్ బైక్‌లపై సోంపల్లి పుష్కర స్నానానికి బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అల్లుడు రావుల దుర్గాప్రసాద్ డ్రైవ్ చేస్తున్న బైక్‌పై వెనుక కూర్చున్న వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమెను అమలాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లుడు దుర్గాప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. దీనిపై నగరం ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుష్కరస్నానానికి వెళ్లి వస్తుండగా .. గోవలంక (తాళ్లరేవు) : ఏటిగట్టు రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవలంక గ్రామానికి చెందిన రేవు లక్ష్మి (55) మృతి చెందింది. గోవలంక గ్రామానికి చెందిన లక్ష్మి గోదావరిలో పుష్కర స్నానం చేసి తిరిగి గ్రామంలోకి వస్తుండగా కోటిపల్లి వైపు వెళుతున్న పల్లిపాలెం గ్రామానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెం దింది. కేసుదర్యాప్తు చేస్తున్నట్టు కోరంగి ఏఎస్సై ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. కుప్పకూలిన మహిళ : రక్షించిన గ జ ఈతగాళ్లు కోటిలింగాలఘాట్ (రాజమండ్రి) : పుష్కర స్నానం చేస్తూ ఒక భక్తురాలు గోదావరిలో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన గజ ఈతగాళ్లు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన బాగ్యలక్ష్మి శుక్రవారం బంధువులతో కలిసి కోటిలింగాల రేవుకు పుష్కరస్నానం చేయడానికి వచ్చింది. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గజ ఈతగాళ్లు రక్షించి, ప్రభుత్వ వైద్య శిబిరం దగ్గరకు చేర్చగా వైద్యులు సేవలందించారు. అనంతరం 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు సుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల అస్వస్థతకు గురైనట్టు వెద్యులు తెలిపారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు. -
వివాహితపై అర్ధరాత్రి దాడి
గండేపల్లి, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో అర్ధరాత్రి వివాహితపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గండేపల్లిలో మల్లేపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రాఘవ, తన పిల్లలు దుర్గా ప్రసాద్, రామలక్ష్మితో స్థానిక వేంకటేశ్వర రైస్ మిల్లు ఎదురుగా నాలుగేళ్లుగా పూరింట్లో నివసిస్తోంది. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన కర్రి సూరిబాబు మద్యం తాగొచ్చి శుక్రవారం రాత్రి ఆమెపై కర్రతో దాడి చేశాడు. అడ్డొచ్చిన రామలక్ష్మిపై కూడా దాడి చేశాడు. దీంతో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన సూరిబాబు అదే రోజు అర్ధరాత్రి పూరింట్లో నిద్రిస్తున్న రాఘవపై కత్తితో దాడి చేయడంతో తల, కాళ్లపై తీవ్ర గాలయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం 108లో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై బీవీ రమణ తెలిపారు. ముందుగా స్పందించి ఉంటే.. ఇలాఉండగా పోలీసులు ముందుగా స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం సూరిబాబు మద్యం తాగొచ్చి.. తన భార్య పార్వతిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె భయపడి తమ బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఈ క్రమంలో సూరిబాబు బాధితురాలు రాఘవ ఇంటికి వెళ్లి తన భార్య ఎక్కడుందో చెప్పాలంటూ ఆమెను, ఇంట్లో వారిని బయటకు ఈడ్చుకొచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన సూరిబాబు ఆమెపై మళ్లీ దాడి చేశాడు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు చెప్పారు.