పోలీసుల రక్షణ కోరిన ప్రేమజంట | Love seek police protection | Sakshi
Sakshi News home page

పోలీసుల రక్షణ కోరిన ప్రేమజంట

Published Wed, Jun 21 2017 11:46 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

పోలీసుల రక్షణ కోరిన ప్రేమజంట - Sakshi

పోలీసుల రక్షణ కోరిన ప్రేమజంట

మదనపల్లె టౌన్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట తమకు పెద్దల నుంచి రక్షణ కల్పిం చాలంటూ మంగళవారం రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన రెడ్డెబాబు, భాగ్యలక్ష్మి కుమార్తె లావణ్య(22) స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అవెన్యూ రోడ్డులోని ఓ కలర్‌ ల్యాబ్‌లో పనిచేసే వెంకటరమణ కుమారుడు అరుణ్‌కుమార్‌(25) ప్రేమలో పడింది. 8 ఏళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది.

విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు ఆమెకు సదుంకు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవాల్సి ఉండగా లావణ్య, అరుణ్‌కుమార్‌ ఇంటి నుంచి పారిపోయి కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలో వివాహం చేసుకున్నారు. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని విషయం చెప్పి, పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెద్దలను ఒప్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement