Chittoor Crime News: Woman Cheats Young Man for Money - Sakshi
Sakshi News home page

మామ వద్ద రూ.2 లక్షలు.. భర్త నిలదీయడంతో.. కి‘లేడీ’ జంప్‌

Published Wed, Jul 14 2021 9:58 AM | Last Updated on Wed, Jul 14 2021 1:24 PM

Woman Cheats Young Man for Money In The Name of Love at Chittoor - Sakshi

సాక్షి, తిరుపతి క్రైం: పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసి పరారీలో ఉన్న కి‘లేడీ’ని మంగళవారం అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ దేవేంద్రకుమార్‌ కథనం.. విజయపురం మండలం నాగరాజకండ్రిగ కు చెందిన సునీల్‌కుమార్‌(29) మార్కెటింగ్‌ ఉద్యోగం చేసుకుంటూ తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివస్తున్నాడు. ఇతనికి ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే ఎం.సుహాసినితో కలిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఏడాది డిసెంబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాను అనాథనని చెప్పడంతో సునీల్‌కుమార్‌ కుటుంబ పెద్దలు సుహాసినికి 20 గ్రాముల బంగారం ఇచ్చారు.

ఆ తర్వాత ఆమె మాయమాటలు చెప్పి సునీల్‌ తండ్రి వద్ద మరో రూ.2లక్షలు తీసుకుంది. విషయం తెలుసుకున్న సునీల్‌ నిలదీయంతో జూన్‌ 8వ తేదీన ఇంట్లో నుంచి జారుకుంది. ఆమె ఆధార్‌ కార్డు ఆధారంగా విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై ఒక కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏడాది క్రితం మరో వ్యక్తిని కూడా ఇలాగే మోసం చేసినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు జూన్‌ 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం తిరుపతి స్విమ్స్‌ వద్ద వివేకానంద సర్కిల్‌లో సుహాసినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement