Raipur Crime News: 56 Year Old Woman Molestation, Brutalised With An Iron Rod - Sakshi
Sakshi News home page

56 ఏళ్ల మహిళపై అత్యాచారం...ఇనుప రాడ్‌తో చిత్రహింసలు పెట్టి..

Published Tue, Apr 12 2022 12:43 PM | Last Updated on Tue, Apr 12 2022 1:12 PM

56 Year Old Woman Molestation, Brutalised With An Iron Rod  - Sakshi

సాక్షి, రాయ్‌పూర్‌: ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. అంతేగాదు మహిళల పై అత్యాచారాలు చేయడమే కాకుండా అతికిరాతకంగా చంపేస్తున్నారు. ఇంకొంతమంది దుండగులు గుర్తుపట్టడానికి వీలు లేనివిధంగా చేసి అనుమానస్పద మృతిగా చిత్రీకరిస్తున్నారు. అచ్చం అలాంటి సంఘటనే చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం...తొలుత 56 మహిళ రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు మొదట యాక్సిడెంట్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత పోలీసులు సీసీఫుటేజ్‌ల ఆధారంగా ఆమె పై ఎవరో క్రూరంగా దాడి చేస్తున్నట్లు గుర్తించారు.

ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను ఇనుపరాడ్‌తో తీవ్రంగా కొట్టి ఒక  ప్లాట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. ఆమె ప్రతిఘటించడంతో అతికిరాతకంగా చంపి అక్కడ నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ మహిళ మానసిక వికలాంగురాలని, తల్లిదండ్రులు చనిపోవడంతో స్థానికులు పెట్టే ఆహారం తింటూ గడుపుతోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 31 ఏళ్ల కిషన్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

(చదవండి: పన్నెండేళ్ల బాలికపై అన్న వరస అయ్యే యువకుడి అఘాయిత్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement