విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది వాయువ్య దిశగా కదిలి సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం పంబన్- నాగపట్నం పరిసరాల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రేపు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.