‘ఫసల్‌ను సద్వినియోగం చేసుకోండి | Make the most of Fasal | Sakshi
Sakshi News home page

‘ఫసల్‌ను సద్వినియోగం చేసుకోండి

Published Tue, Jul 19 2016 6:21 PM | Last Updated on Thu, Mar 28 2019 5:12 PM

Make the most of Fasal

కందుకూరు : రైతులుప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఓ గీత సూచించారు. దానికి సంబంధించిన వివరాలను ఆమె మంగళవారం వెల్లడించారు. ఈ పథకంలో అన్ని ఖరీఫ్‌ పంటలకు రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియంను నిర్ధారించడం జరిగిందన్నారు. మొక్కజొన్న హెక్టార్‌కు రూ.50 వేల బీమాకు రైతు వాటాగా రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే గ్రామం యూనిట్‌గా తీసుకుంటారన్నారు. వరి హెక్టార్‌కు రూ.70 వేలకు ప్రీమియం రైతు వాటాగా రూ.910, జొన్న హెక్టార్‌కు రూ.25 వేలకు గాను ప్రీమియం రూ.500, కంది హెక్టార్‌కు రూ.32,500 బీమాకు గాను రూ.650, పెసర, మినుము హెక్టార్‌కు రూ.25 వేల బీమా మొత్తానికి గాను ప్రీమియం రూ.500 చొప్పున చెల్లించాలని చెప్పారు. మొక్కజొన్న మినహా మిగతా పంటలన్నీ మండలం యూనిట్‌గా తీసుకుని నష్టపరిహారాన్ని అంచనా వేస్తారని వివరించారు. రుణం తీసుకోని రైతులు ప్రీమియంను ‘ఏఐసీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’పేరుతో డీడీ తీసి సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు డీడీ, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంక్‌ ఖాతాను జతచేసి సంబంధిత బ్యాంక్‌లో అందజేయాలన్నారు. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతులకు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంక్‌ నుంచి రుణం తీసుకునే రైతులకు సెప్టెంబర్‌ ఆఖరు వరకు గడువు ఉంటుందన్నారు. దరఖాస్తులు మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement