గుర్రమే జీవనాధారం
ఊరూరా తిరుగుతూ వ్యాపారం
మునిపల్లి: గుర్రంపై ఠీవీగా ఉన్నాడు.. ఇతనిదేమైనా రాచరిక కుటుంబమా? అని అనుకుంటున్నారా? అ లాంటిదేమీ లేదు.. గుర్రమే ఇతని జీవనాధారం. అదెలా అనుకుంటే ఈ స్టోరీ చదవండి... మునిపల్లి మం డలం ఖమ్మంపల్లికి చెందిన కట్కె పాషమియా పెద్దగా చదువుకోలేదు. దీంతో తన పూర్వీకులు చేసిన పనినే జీవనోపాధిగా మల్చుకున్నాడు. మండల పరిధిలో అంతారం, ఖమ్మంపల్లి, చిన్న చల్మెడ, మునిపల్లి తదితర గ్రామాల్లో జరిగే సంతల్లో గొర్రెలు, మేకల మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. ఈక్రమంలో దాదాపు 40 కిలోమీటర్లు గుర్రంపైనే వెళ్తుంటాడు.
చదువు విలువ తెలిసింది
‘మా నాన్న కట్కె మౌలన్‌సాబ్. చదువకోమని ఎన్నిసార్లు చెప్పిన వినలే. ఆయనతో పోయి మేక, గొర్రెల మాంసం అమ్మేతో డిని. దీంతో ఈ వ్యాపారం ఎట్ల చేయాలో తెలిసింది. రెండెకరాల పొలం ఉంది. దాంతో పాటు ఈ వ్యాపారం చేస్తూ భార్య, పిల్లల్ని పోషించుకుంటున్న. నాలా నా కొడుకులు కాకూడదని వాళ్లను చదివిస్తున్న’ అని పాషమియా ‘సాక్షి’కి చెప్పాడు.