విశాఖపట్నం: పెళ్లింట విషాదం నెలకొంది. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని 48వ వార్డు బర్మా కాలనీలో శుక్రవారం వెలుగు చూసింది. కాలనీకి చెందిన గందవరపు శివ(25) ఇంటర్ వరకు చదువుకొని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 13న(ఆదివారం) పెళ్లి జరగాల్సి ఉంది.
ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ పెళ్లి ఇష్టంలేకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.
రెండ్రోజుల్లో పెళ్లి.. యువకుడు ఆత్మహత్య
Published Fri, Nov 11 2016 9:42 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement