మహిళ సర్పంచ్కు మోహన్ బాబు ప్రశంసలు | manchu mohanbabu, chevireddy baskarreddy watch jallikattu | Sakshi
Sakshi News home page

మహిళ సర్పంచ్కు మోహన్ బాబు ప్రశంసలు

Published Mon, Feb 8 2016 1:26 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

మహిళ సర్పంచ్కు మోహన్ బాబు ప్రశంసలు - Sakshi

మహిళ సర్పంచ్కు మోహన్ బాబు ప్రశంసలు

చంద్రగిరి: ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు ఓ మహిళను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్కు కోడలుగా వచ్చి, సర్పంచ్గా ఎన్నికై  ప్రజలకు సేవ చేస్తున్నారంటూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల పద్మజను మోహన్ బాబు ప్రశంసించారు. సోమవారం రామిరెడ్డిపల్లిలో నిర్వహించిన జల్లికట్టు ప్రదర్శనకు మోహన్ బాబు, ఆయన కుమారుడు యువ హీరో మంచు మనోజ్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులతో కలసి జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తనకు కొన్ని సిద్ధాంతాలున్నాయని, ఆవులను, జంతువులను హింసించరాదని అన్నారు. పశువులను హింసించకుండా తరతరాలుగా వస్తున్న జల్లికట్టు ఆట నిర్వహించడాన్ని తప్పుపట్టరాదని చెప్పారు. సర్పంచ్ పద్మజను అభినందించారు. పశువులను హింసించకుండా సాంప్రదాయబద్ధంగా జల్లికట్టు నిర్వహించుకోవచ్చని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సర్పంచ్  పద్మజ కృతజ్ఞతలు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement