
'మా వెనక జగన్ ఉన్నారని బాబు చెప్పడం హాస్యాస్పదం'
ఎస్సీలను 2 దశాబ్దాలుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
విశాఖ: ఎస్సీలను 2 దశాబ్దాలుగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
ఎస్సీల వర్గీకరణ అంశంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పేరు వాడుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఉద్యమాలు చేశాం.. అప్పుడు నువ్వు మా వెనకాల ఉన్నావా ? అని సీఎం చంద్రబాబును ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై బాబు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదంటూ ఆరోపించారు.