Published
Sat, Aug 6 2016 12:09 AM
| Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
minister
ఒంగోలు సబర్బన్ :
- రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు
- ఒంగోలులో ప్రెస్‌క్లబ్ ప్రారంభం
జర్నలిజం రంగంలో నైపుణ్యం పెంచుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిలా ఉందని తెలిపారు. ఒంగోలులో పనిచేస్తున్న జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయమై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్టేట్ బస్ పాస్‌లున్న జర్నలిస్టులకు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ప్రతినిధులు ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు అభినందనీయమన్నారు. భవన నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజేæ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండాలన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలన్నారు. ఏపీయూడబ్లూ్యజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ ఇ్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వని జర్నలిస్టులకు ఇవ్వాలని.. డెస్క్ జర్నలిస్టులకు, యూనిట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా కేటాయించాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహనబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అక్రిడేషన్ కమిటీ సబ్యులు మీసాల శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.మురళి, కె.వి.సురేష్ కుమార్‌రెడ్డి, రాష్ట్రకార్యవర్గ సబ్యులు ఏ.సురేష్ పాల్గొన్నారు.