minister sidda raghavarao
-
బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలు
-
'ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం'
-
'ఆర్టీసీకి రూ.17 కోట్ల నష్టం'
► విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాలు అమరావతి : పెద్ద నోట్ల రద్దు పరిణామం తర్వాత ఆర్టీసీ రూ.17 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. గురువారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా స్వైపింగ్ యంత్రాలను మంత్రి శిద్ధా ప్రారంభించారు. అనంతరం మంత్రి శిద్ధా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తొలి విడత కష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్లలో టిక్కెట్ రిజర్వేషన్ కోసం 50 స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. వారం రోజుల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా చూస్తామన్నారు. త్వరలో రెగ్యులర్ సర్వీసుల్లో కూడా డ్రైవర్లకు స్వైపింగ్ యంత్రాలను అందిస్తామన్నారు. నగదు రహిత ప్రయాణాలకు ఆర్టీసీ శ్రీకారం చుట్టిందని, దశల వారీగా అన్ని సర్వీసుల్లో ఈ-పోస్ యంత్రాలు అందుబాటులో ఉంచుతామని ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పేర్కొన్నారు. -
ప్రజలు..ప్రభుత్వానికి వారధి మీడియా
ఒంగోలు సబర్బన్ : - రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు - ఒంగోలులో ప్రెస్‌క్లబ్ ప్రారంభం జర్నలిజం రంగంలో నైపుణ్యం పెంచుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను మంత్రి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిలా ఉందని తెలిపారు. ఒంగోలులో పనిచేస్తున్న జర్నలిస్టులకు, నాన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయమై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్టేట్ బస్ పాస్‌లున్న జర్నలిస్టులకు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీ ప్రతినిధులు ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఏర్పాటు అభినందనీయమన్నారు. భవన నిర్మాణానికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజేæ రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐకమత్యంగా ఉండాలన్నారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలన్నారు. ఏపీయూడబ్లూ్యజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ ఇ్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వని జర్నలిస్టులకు ఇవ్వాలని.. డెస్క్ జర్నలిస్టులకు, యూనిట్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా కేటాయించాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహనబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అక్రిడేషన్ కమిటీ సబ్యులు మీసాల శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.మురళి, కె.వి.సురేష్ కుమార్‌రెడ్డి, రాష్ట్రకార్యవర్గ సబ్యులు ఏ.సురేష్ పాల్గొన్నారు. -
R&B కార్యలయం ప్రారంభించిన మంత్రి
-
ఇదేమి శిద్దాంతం
♦ రంగంలోకి స్టూడెంట్ స్పెషల్స్ ♦ బస్సు మిస్సయితే చేతికి భారమే ♦ ప్రయోగాత్మకంగా జిల్లాలో ఐదు సర్వీసులు ♦ అద్దంకిలో ఒకటి ప్రారంభం, మరో మూడు డిపోల్లో సిద్ధం ♦ స్టడీ అవర్స్ ఉన్నా..అదనపు క్లాసులు జరిగినా విద్యార్థులకు చేతి చమురే ఒంగోలు : తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆర్టీసీ అధికారులు స్టూడెంట్ స్పెషల్’ పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపడానికి తెరదీశారు. విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తున్నామని ఆర్టీసీ చెబుతూ చాపకింద నీరులా జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇప్పటికే అద్దంకి డిపోలో ఒక బస్సు ప్రారంభం కాగా మరో మూడు డిపోలను రోడ్డుపైకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లాలోనే స్టూడెంట్స్‌కు సెగ ప్రారంభించారు. ఇదీ పరిస్థితి... అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ సర్వే నిర్వహించింది. ప్రయివేటు వాహనాల్లో తిరుగుతున్న రూట్లను గుర్తించారు. కందుకూరు నుంచి విజయవాడకు, కనిగిరి నుంచి విజయవాడకు ఎక్కువుగా తిరుగుతున్నట్టుగా నిర్థరించారు. ఇక నిత్యం హైదరాబాదుకు స్టేజీ క్యారియర్లుగా నడుపుతున్న సర్వీసులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిని నిరోధించాల్సింది ఆదాయం పెంచుకోవల్సిందిపోయి ఉరిమి,ఉరిమి మంగళంపై పడ్డట్టు విద్యార్థులపై వీరి కన్ను పడింది.రద్దీ సమయాలలో ‘పల్లె వెలుగు’ బస్సులలో విద్యార్థులు ఎక్కడం వల్లే ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారని, ఈ కారణంగానే ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోతుందంటూ ఆర్టీసీ అధికారులు లెక్కల చిట్టా విప్పారు. వీటికి పరిష్కారం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్స్ స్పెషల్ బస్సులను’ తెరపైకి తెచ్చారు. ఇబ్బందులేమిటి... ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులలో విద్యార్థి ఉదయం బస్సు ఎక్కి కళాశాల లేదా స్కూలుకు వెళితే సాయత్రం 8 గంటలలోపు తిరిగి ఇంటికి చేరుకునేందుకు దృష్టి సారించేవాడు. అందుకు కారణాలు అనేకం. విద్యార్థికి 35 కిలోమీటర్ల వరకు రాయితీ బస్సు పాసు (ఊరక ఇచ్చేది కాదు...ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తుంది) సౌకర్యం ఉంది. దీంతో సంబంధిత విద్యార్థి ఏ సమయంలోనైనా కళాశాలకు వెళ్లేవాడు, తిరిగి వచ్చేవాడు. కళాశాలలో చదివే విద్యార్థి ఆ చదువుతో పాటు దీనికి అనుబంధంగా ఉండే కోర్సులు, కంప్యూటర్లు, ట్యూషన్లు, అదనపు కోర్సులు చేయడానికి పట్టణాల్లోనే రెండు, మూడు గంటలు ఉండిపోతారు. తరువాత ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు ఇళ్లకు చేరుకుంటారు. అలాగే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా కళాశాల సమయానికి ముందు పలు శిక్షణలు పొందుతుంటారు. వీరందరికీ స్టూడెంట్ స్పెషల్ బస్సులు అశనిపాతంగా తయారయ్యాయి. కాలేజీలు, పాఠశాలలు ఒక్కోసారి మధ్యాహ్నానికే శెలవు ఇవ్వడం లేదా క్లాసులు జరగక విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాల్సిన సాయంత్రం స్టూడెంట్ స్పెషల్ వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే. ఇక సాధారణంగా పాఠశాలలు వదిలే సమయం సాయంత్రం 4.45 గంటలు. పాఠశాల వదలగానే పీఈటీలు పిల్లలను ఆడించేందుకు గ్రౌండులోకి పిలుస్తుంటారు. క్రీడాకారులైన పిల్లలు సాధారణ విద్యార్థులకన్నా ఒక గంట అదనంగా సమయం తీసుకొని ఇంటికి బయల్థేరడం సహజం. గతంలోలా పల్లెవెలుగు బస్సును ఎక్కనివ్వరు. మరి వీరి సమస్యలు ఎలా గట్టెక్కుతాయని విద్యార్థులు వాపోతున్నారు. అనుమానాలను నివృత్తిచేసిన తరువాతే బస్సులను ఏర్పాటు చేయాలి స్టూడెంట్ స్పెషల్ బస్సుల పట్ల విద్యార్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను ఆర్టీసీ అధికారులు బహిర్గతం చేయాలి. అంతే తప్ప ఏకపక్షంగా బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలనుకుంటే మాత్రం సహించం. -ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అశోక్ ప్రత్యేక బస్సులను ఆహ్వానిస్తాం...కానీ: స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తాం. అయితే ఆ పేరుతో ఇతర బస్సులలో విద్యార్థులను ఎక్కనీయమంటే మాత్రం ఊపేక్షించం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థికి చాలా సమయం పడుతుంది. నిత్యం లైబ్రరీలల్లో ఉంటూ విద్యార్థులు విద్యపై ఆసక్తిచూపే వారు చాలామందే ఉంటున్నారు. అటువంటి విద్యార్థులు అందరనీ ఒకే సమయంలో ఇంటికి చేరాలంటే కుదరదు. ఇతర సమయాల్లోను విద్యార్థులను పల్లెవెలుగు బస్సులలో ఎక్కనివ్వాలి. -ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పల్లెవెలుగుల్లో అనుమతించకపోతే పోరాటమే విద్యార్థులను తాము ఏర్పాటుచేసిన స్టూడెంట్ స్పెషల్ బస్సులలో మాత్రమే అనుమతిస్తామంటే సహించం. నేడు కంప్యూటర్ క్లాసులకు విద్యార్థులు అత్యధికంగా వెళుతున్నారు. వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలంటే ఆలస్యమవుతుంది. పల్లెవెలుగుల్లో విద్యార్థులను ఎక్కనీయకుండా చేస్తే మాత్రం ఉద్యమమే శరణ్యం. -పీడీఎస్యు రాష్ట్రకార్యదర్శి మల్లిఖార్జున్ ముమ్మాటికీ విద్యార్థి వ్యతిరేక చర్యే ముమ్మాటికీ ఇది విద్యార్థి వ్యతిరేక చర్యే. ఒక రూట్లో తిరిగే విద్యా సంస్థలన్నింటినీ ఒకేసారి మూసివేయడం జరగదు. సిలబస్ కాకపోతే ప్రత్యేక క్లాసులు, సాధారణ విద్యార్థుల కోసం నిర్వహించే అదనపు బోధనా తరగతులు, విద్యార్థుల్లో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు చేపట్టే స్టడీ అవర్స్, కంప్యూటర్ క్లాసులుంటాయి. మేము బస్సులు వేశాం...కాబట్టి అవే బస్సులలో విద్యార్థులు ఎక్కాలి...మిగితా పల్లె వెలుగులలో ఎక్కనీయకుండా ఆర్టీసీ అధికారులు దృషి ్ట సారించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ఆందోళన ఉధృతం చేస్తాం -వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సూరె మణికంఠారెడ్డి జిల్లా వ్యాప్తంగా 20 బస్సులు మొత్తం 20 బస్సులను జిల్లావ్యాప్తంగా ఉన్న 8 డిపోల ద్వారా నడపాలని ఆర్టీసీ ప్రకాశం రీజియన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి ఐదు సర్వీసులను సిద్ధ చేసింది. వాటిలో అద్దంకి డిపో పరిధిలో ఇప్పటికే ఒక బస్సు నడుస్తోంది. ఆ బస్సులో ట్రిప్పుకు 80 నుంచి 90 మంది విద్యార్థులు ఎక్కుతున్నట్లు అంచనా. అద్దంకి-ఉప్పలపాడు, అద్దంకి- ధర్మవరం మార్గాలలో నడుపుతున్నారు. ఒకే బస్సు నడవడం వల్ల ఒక రూట్లో ముందుగా బస్సు బయల్థేరుతుంది. రెండో మార్గంలో ఆలస్యంగా బయల్థేరుతుంది. మార్కాపురం పరిధిలో మార్కాపురం-మిట్టమీదిపల్లికి ఒకటి నడుస్తుంది. కందుకూరు డిపో పరిధిలో ఒకటి సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నా... జిల్లా వ్యాప్తంగా మేజర్ రూట్లన్నింటిలో ఈ విధానాన్ని ఏర్పాటుచేసి చివరకు భారం పిల్లలపై వేయనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి సంఘాలతో చర్చలేవీ... ఈ విషయంపై నిర్ణయం తీసుకునే క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై కనీసం ఆర్టీసీ అధికారులు ఒక సదస్సు నిర్వహించి విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంగానీ, కనీసం విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించి చర్చించడం గానీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీ మార్గాలలో మరో అదనపు బస్సును ఏర్పాటుచేస్తే సమస్య ఉండదని విద్యార్థివర్గాలు పేర్కొంటున్నాయి. -
రిమ్స్‌కే రోగమొచ్చింది
జిల్లాకే పెద్ద దిక్కుగా నిలవాల్సిన రిమ్స్ మంచాన పడింది. అరకొర సదుపాయాలు, వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం వైఫల్యాలు రిమ్స్ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా నిలిచాయి. మరోవైపు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మృత్యువాత పడగా మరో ఐదుగురు ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారు. జులై నెలలో ఇదే ఆసుపత్రికి ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావు వచ్చి పలు ఆదేశాలిచ్చినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తరువాత మంత్రి శిద్దా, కలెక్టర్ విజయకుమార్ వచ్చి కన్నెర్ర చేసినా పట్టించుకునే నాథుడే కరవాయే. వందసీట్లెప్పుడు...? మరో వైపు జిల్లాకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిమ్స్ పూర్తి కాకుండానే కునారిల్లే పరిస్థితికి వచ్చింది. ఎంబీబీఎస్ నాల్గో సంవత్సరం ప్రారంభమైనా నిర్మాణ పనులు ఇంకా సా...గుతూనే ఉన్నాయి. దీంతో ఏ ఏడాదికాయేడు రిమ్స్ సీట్లను ఎంసీఐ ఇవ్వకపోవడం, మళ్లీ ప్రభుత్వం కదిలి అనుమతులు తెప్పించడం జరుగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా వంద సీట్లకు అనుమతిచ్చే పరిస్థితి కనపడటం లేదు. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ తనిఖీలకు వచ్చే ముందు హడావుడిగా పనులను చేయడం తనిఖీలు అయిన అనంతరం నత్తతో పోటీ పడుతూ నిర్మాణాలు చేయడం కాంట్రాక్టర్లకు రివాజుగా మారింది. జీతాలకూ కనా కష్టం రిమ్స్‌లో కాంట్రాక్టు సిబ్బందికి జీతాలిచ్చి ఏడు నెలలయింది. వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. వారికి కాంట్రాక్టు పొడిగింపులో కూడా నిర్లక్ష్యం కనపడుతోంది. మరోవైపు రిమ్స్‌కు ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. జనరల్ సర్జరీ,అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్,అర్ధ్రోపెడిక్స్, రేడియాలజీ, టి.బి., సైకాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఫ్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలున్నా సిబ్బంది కొరతతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేకుండాపోతోంది. పరికరాలు సరఫరా చేసి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ వాటిని వాడకపోవడంతో పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. రిమ్స్‌లో ఎన్ని వెంటిలేటర్లున్నాయనే విషయం వైద్యులకే తెలియని పరిస్థితి ఉంది. మందిలించినా మార్పు లేదు.. జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య కళాశాల అయినప్పటికీ, ట్రామా సెంటర్ ఉన్నప్పటికీ దాదాపు 50 శాతానికి పైగా కేసులను గుంటూరు జనరల్ అసుపత్రికి రిఫరల్ చేసి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. గుంటూరు గైనిక్ విభాగం వారు రిమ్స్ నుంచి రిఫరల్ కేసులన్నింటిటినీ నమోదు చేసి ఈ నివేదికను డీఎంఈ కి పంపారు. దీంతో డీఎంఈ రిమ్స్ అధికారులను చీవాట్లు పెట్టారు. జాతీయ రహదారుల శాఖ అంబులెన్సును, రిమ్స్‌కు చెందిన రెండు అంబులెనన్సులను, బ్లడ్ బ్యాంక్‌లోని అంబులెన్సులను ఉపయోగించకుండా ఖాళీగా పెట్టారు. రిమ్స్ క్యాజువాలిటీ విభాగంలో వీల్‌చైర్ లు కూడా అవసానదశకు చేరుకున్నాయి. ఇవి కూడా సిబ్బంది చేతులు తడిపితేనే నడుస్తాయి. ఎ.ఆర్.టి. సెంటర్లో ఎయిడ్స్ మందులు కూడా పూర్తిస్థాయిలో ఉండటం లేదు. వేళకు రారాయే... గతంలో రిమ్స్‌ను సంధర్శించిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రిమ్స్‌లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మెజార్టీ వైద్యులు ఉదయం 9 గంటలకు సంతకాలు పెట్టి 12 గంటలకు వెళ్లిపోతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వచ్చి సంతకాలు పెడుతున్నారు. రాత్రి వేళల్లో స్పెషలిస్టు వైద్యుడు కాదు కదా, మాములు వైధ్యులు కుడా ఉండటంలేదు. వీరి పై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. గతంలో భారతీయ వైద్య మండలి తనిఖీకి వచ్చిన సమయంలో దాదాపు 13 కారణాలను ఎత్తి చూపింది. వీటిలో ముఖ్యంగా ఆడిటోరియం నిర్మాణం, అత్యాధునిక ఎక్స్‌రే మిషన్, ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వైద్యుల కొరత ఉన్నాయి. వీటిలో ఆడిటోరియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎంసీఐ తనిఖీలకు వచ్చే లోపు పూర్తి కాదు కూడా.