21న మెగా డ్యాన్స్‌ షో | mega dance show on 21st | Sakshi
Sakshi News home page

21న మెగా డ్యాన్స్‌ షో

Published Sat, Aug 6 2016 11:44 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

మెగా డ్యాన్స్‌ షో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ - Sakshi

మెగా డ్యాన్స్‌ షో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పువ్వాడ

ఖమ్మం కల్చరల్‌: తెలంగాణ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ ఖమ్మం జిల్లా కమిటీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం మెగా టీమ్‌ సహకారంతో ఈ నెల 21న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఖమ్మం జిల్లా మెగా డ్యాన్స్‌ షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రిథమ్‌ సైదులు, లింగనబోయిన కిరణ్‌కుమార్‌లు తెలిపారు. ఇం దుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం ఆవిష్కరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైదులు, కిరణ్‌లు మాట్లాడుతూ జిల్లాలోని 500మంది డ్యాన్స్‌ మాస్టర్లతో మెగా హరితహారం కార్యక్రమం కూడా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని డ్యాన్స్‌ మాస్టర్లు, అసోసియేషన్‌ సభ్యు లు, డ్యాన్సర్లు పాల్గొని మెగా డ్యాన్స్‌షోను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మెగా టీమ్‌ అధ్యక్షుడు రుద్రగాని ఉపేందర్, వీరేష్‌గౌడ్, అంకిత్, తెలంగాణ డ్యాన్స్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పి. ఉమామహేశ్వర్, యు. నాగరాజు, కోశాధికారి గుండు నాగరాజు, టౌన్‌ అధ్యక్షుడు భవాని శంకర్, ప్రధాన కార్యదర్శి ఎ. రాజేష్, కోశాధికారి నాని తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement