తపష్‌కు రికార్డు పత్రాన్ని అందజేస్తున్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు
సాక్షి, హైదరాబాద్ : దివ్యాంగుడైన (డౌన్ సిండ్రోమ్ ) 9 ఏళ్ల బుడతడు 35 నిమిషాల నాన్ స్టాప్ డ్యాన్స్‌తో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. బోయిన్‌పల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా దమ్మాయిగూడ చెందిన భవానీ–లోకేష్ కుమారుడు తపష్ డ్యాన్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. హిప్ అప్, వెస్ట్రన్, బాలీవుడ్, మాస్ బీట్, ఫోక్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్‌లకు అనుగుణంగా స్టెపులు వేస్తూ 35 నిమిషాల పాటు నిర్విరామంగా నృత్యం చేసి ఆకట్టుకున్నాడు.
ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న 18 నిమిషాల రికార్డును తపష్ బద్దలు కొట్టాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు బింగి నరేందర్‌గౌడ్, స్వర్ణ బాలుడికి రికార్డు పత్రాన్ని, షీల్డ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా తపష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ చిన్నారికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ ఆ దిశగా ప్రోత్సహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment