ఉంగుటూరు (పశ్చిమగోదావరి): రాష్ట్రాభివృద్ధి కేంద్రంపైనే ఆధారపడి ఉందని.. అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు పూర్తిస్థాయిలో సహకరించటం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఆదివారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 19సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోయిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీలు లేదా ప్రజలు 10 శాతం నిధులను విరాళంగా ఇస్తే 90 శాతం ఉపాధి హామీ పథకం నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర సహకారం లేదు: అయ్యన్నపాత్రుడు
Published Sun, Jun 5 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
Advertisement