రాయదుర్గం రూరల్ : ఏడాదిలోగా రాష్ట్రంలో లక్ష ఇళ్లను నిర్మిస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం బొమ్మక్కపల్లిలో ఆయన పర్యటించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దాణా, మాగుడుగడ్డి వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి పాడిరైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేలు జాతి పశువులను ఎంపిక చేసుకుని ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా బీటి ప్రాజెక్టుకు నీరు తెచ్చేందుకు పాటు పడతామన్నారు. గ్రామంలో ఒక్కరికి కూడా నూతన ఎన్టీఆర్ గృహాలు మంజూరు కాలేదని పలువురు లబ్ధిదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.