
అభివృద్ధి, సంక్షేమమే గెలిపిస్తుంది: కేటీఆర్
ఇరవై రెండు నెలలుగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పాలేరు ఉప ఎన్నికలోల టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తాయని
ఖమ్మం: ఇరవై రెండు నెలలుగా రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పాలేరు ఉప ఎన్నికలోల టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేక విపక్షాలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తే పాలేరు నియోజకవర్గానికి సాగునీరు, తాగునీటి సమస్య తీరుస్తారన్నారు.