
'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు'
నిజామాబాద్ : 60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం నాడు ఆయన పర్యటిస్తున్నారు. జిల్లాలోని పిట్లం మండలం కుర్తి గ్రామంలో గ్రామజ్యోతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలకులపై విమర్శలు గుప్పించారు. గత పాలకులు చేసిన పాపాలు మేం కడుగుతున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా కుర్తి గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు.