మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్‌ను బాంబులతో పేల్చినప్పుడు ఇప్పుడు ధర్నాలు చేస్తున్న ఈ సన్నాసులు ఎక్కడున్నారని ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రేవంత్‌రెడ్డిలను ఉద్దేశించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణతో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కర్ణాటక సర్కారుతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారని, త్వరలో అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు.
ఓ వైపు ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు జరుగుతుంటే ఓ సన్నాసి దీక్ష చేయడం మరో సన్నాసి మద్దతు తెలుపడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్డీఎస్ గేట్లను పగులగొడితే నోర్లు మూసుకున్న ఈ దద్దమ్మలు.. పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం తగదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా తొత్తులుగా ఉన్న వీరే అన్యాయం చేసి.. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు కలుసుకోవడం నీచరాజకీయాలకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
అప్పుడెక్కడున్నారీ సన్నాసులు?
Published Tue, May 10 2016 1:39 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement