minister lakshmareddy
-
పాలమూరుకు కృష్ణమ్మ..
- జూరాలకు వరద నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలకు సీఎం ఫోన్ - కోయిల్‌సాగర్ లిఫ్టు పంపులను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరును కృష్ణమ్మ జలాలు ఈ ఏడాది ముందే పల కరించాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో కోయిల్‌సాగర్ లిఫ్టు పంపులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. జూరాలకు ఎగువ నుంచి 7 వేలకు పైగా క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుం డడంతో ప్రాజెక్టులో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోయిల్‌సాగర్ లిఫ్టులను ప్రారంభించి చెరువులను నింపాలని సీఎం కేసీఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి బుధవారం ఫోన్ చేసి ఆదేశించారు. దీంతో జిల్లా పర్యట నలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఒక పంపును ఆన్ చేశారు. ఒక పంపును ఆన్ చేయడం ద్వారా 315 క్యూసెక్కుల నీరు పంపింగ్ అవుతోంది. పంపు ద్వారా ప్రాజె క్టులోకి రోజూ 0.05 టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. దారి పొడ వునా ఉన్న గొలుసుకట్టు చెరువులను కూడా నిం పాలని నిర్ణయించారు. కోయిల్ సాగర్ లిఫ్టు పనులను ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ సీఎం ముందుచూపు వల్లే పం పులను ప్రారంభించినట్లు తెలిపారు. జూన్ లో ఎత్తిపోతల పంపులను ప్రారంభించడం చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. -
కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక
అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) అధికారులతో సచివాలయంలో కల్తీ నివారణపై మంత్రి సమీక్ష చేశారు. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ హానికరం, నాసిరకం, మిస్ బ్రాండెడ్ వస్తువుల తయారీపై దృష్టి సారించాలని, వాటి అమ్మకా లను కట్టడి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి సూచించారు. దాడులు చేయడం, శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్స్ అవేర్నెస్ ప్రోగ్రా మ్ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమా వేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివా రీ, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరగాలి
► అధికారులకు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం ► 3న సీఎం చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 30–40 శాతంగా ఉన్న ప్రసవాలను 50 శాతానికి పెంచాలని అధికారులను వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ల పథకం సన్నాహాలపై శుక్రవారం సచివాల యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ల పథకాన్ని వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రసవాలు జరిపే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకం కింద గర్భిణుల నమోదు మొదలైందని, ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలని చెప్పారు. గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేల ప్రోత్సా హకం అందిస్తామని, ప్రసవం తర్వాత రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, అన్ని ప్రసూతి కేంద్రాల్లో వైద్య బృందాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట నిజమేనని, నియామకాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వేణుగోపాల్, ఆరోగ్య పథకం సీఈఓ పద్మ పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి అమ్మఒడి
- ఆరోజు నుంచే కేసీఆర్ కిట్లు ప్రారంభం - వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి - ఆధార్‌తో గర్భిణులకు బ్యాంకు ఖాతాలు సాక్షి, హైదరాబాద్: అమ్మఒడి, కేసీఆర్ కిట్ల కార్యక్రమాన్ని జూన్ 2న ప్రారంభించను న్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఇందుకు శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ని రూపొందించామని, పైలట్ ప్రాజెక్టుగా పాలమూరు వివరాలు పొందు పరిచామని చెప్పారు. పథకాల ఏర్పాట్లపై సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారుల ను ఆదేశించారు. గర్భిణులను ప్రాథమిక దశలోనే గుర్తించడం, వివరాలు నమోదు చేయడం, నెల నెలా పరీక్షలు చేయించడం విధిగా జరగాలన్నారు. పరీక్షల సమయం లోనే హైరిస్క్ కేసులని గుర్తించాలని, ఆ ప్రకారం ఆస్పత్రిలో ప్రసవం చేయించాల న్నది నిర్ణయించాలన్నారు. ఆ నిర్ణయాన్ని ముందుగానే గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు తెలిపి నిర్ణీత కేంద్రాల్లోనే ప్రసవా లు జరిగేట్లు చూడాలన్నారు. సిజేరియన్ సంఖ్యని మరింత తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని లక్ష్మారెడ్డి చెప్పారు. ఆధార్ అనుసంధానంతో గర్భిణీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని.. వృద్ధులకి అందిస్తున్న ఆసరా పెన్షన్ల మాదిరిగా వేగంగా డబ్బులు జమచేయడం, విత్‌డ్రా చేసుకునే వీలుండాలన్నారు. ఆటంకం లేకుండా డబ్బులందాలి గర్భిణీలకు ఏఎన్సీ పరీక్షల సమయంలో రూ.4 వేలు, ప్రసూతి సమయంలో రూ.4 వేలు, ప్రసవానంతరం బిడ్డలకి టీకాల కోసం రూ.4 వేలు ఆటంకం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడ బిడ్డ పుడితే అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పథకంలో ప్రభుత్వం ఇస్తున్న అదనపు రూ.వెయ్యి కలిపి ఇవ్వాలన్నారు. గర్భిణీ వివరాలు నమోదు చేసుకున్నప్పటి నుంచి టీకాలిచ్చే వరకు పూర్తి సమాచారం సాఫ్ట్‌వేర్‌లో ఉండాలని చెప్పారు. పథకం సరిగా అమలవడానికి ప్రభుత్వ ప్రసవ కేంద్రాల్లో అన్ని వసతులుండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పీజీ వైద్య ఫీజుల పెంపు!
వైద్యారోగ్య శాఖ సూత్రప్రాయ నిర్ణయం - ప్రైవేటు మెడికల్ కాలేజీలతో మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు - ఫీజులు రెండింతలు చేయాలంటున్న ప్రైవేటు కాలేజీలు - ఉమ్మడి కౌన్సెలింగ్‌పై న్యాయ సలహాకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య విద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల ఫీజును పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాంతోపాటు పీజీ, యూజీ వైద్య సీట్లను ‘నీట్’ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతారని, అనంతరం ఫీజుల పెంపు, ఉమ్మడి కౌన్సెలింగ్‌పై ప్రకటన వెలువడనుందని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. చర్చల సందర్భంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని కోరాయి. కానీ భారత వైద్య మండలి (ఎంసీఐ) ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించి తీరాలని, అయినా ఈ అంశంపై న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తున్నామని మంత్రి వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక పీజీ వైద్య సీట్ల ఫీజును రెండింతలకుపైగా పెంచాలని యాజమాన్యాలు మంత్రిని కోరగా.. దీనిపై మంత్రి ఎటువంటి హామీ ఇవ్వలేదని, సీఎంతో మాట్లాడాక నిర్ణయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల భర్తీ ఉండనున్నందున ఫీజుల పెంపు విషయంలో సర్కారు తమ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని యాజమాన్యాలు కోరినట్లు తెలిసింది. డొనేషన్లకు చెక్..! ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా క్లినికల్ సీట్లకు రూ.3.2 లక్షలు, యాజమాన్య కోటాలోని క్లినికల్ సీట్లకు రూ.5.8 లక్షలుగా ఫీజు ఉంది. కానీ యాజమాన్యాలు పీజీ సీట్లకు డొనేషన్ల పేరుతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేస్తున్నాయి. అయితే నీట్ ర్యాంకులతో ఈసారి నుంచి డొనేషన్లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే యాజమాన్య కోటా సీట్లకు ఫీజులు భారీగా పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇది సున్నితమైన వ్యవహారం కనుక ఆచితూచి అడుగు వేయాలని, విద్యార్థులపై అధిక భారం పడకుండా నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి కౌన్సెలింగ్‌కే వెళ్లాలన్న కేంద్రం ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే పీజీ, యూజీ వైద్య సీట్లను భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు తాజాగా మరోసారి రాష్ట్రానికి లేఖ రాసింది. కన్వీనర్, యాజమాన్య కోటా, ఎన్నారై సీట్లన్నింటికీ ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు న్యాయ సలహాకు వెళ్లినా ప్రయోజనం ఉండదన్న చర్చ జరుగుతోంది. -
గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రి ఆర్ఎంవో సరస్వతిపై వేటు పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బుధవారం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి, రెండు గంటలపాటు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. విధులను నిర్లక్ష్యం చేయటంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోనట్లుగా తేలిన ఆర్ఎంవో, డిప్యూటీ సివిల్ సర్జన్ సరస్వతిని డీఎంఈకి సరెండర్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని, అలాగే విధుల్లో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడివారు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేనది లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసినందుకు సరస్వతిపై వేటు పడినట్లు సమాచారం. ఇటీవలి గాంధీ ఆస్పత్రిలో వీల్ చైర్స్ కొరత, సాయి ప్రవళిక మృతి తదితర అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
‘గాంధీ’లో లక్ష్మారెడ్డి తనిఖీ, అధికారులతో భేటీ
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల్లో ఇక్కడ 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి అధునాతన యంత్ర పరికరాలతో మరో ల్యాబ్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గాంధీలో ప్రస్తుతం 100 బెడ్లు ఉండగా రెండువేలమంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందుతోందని వివరించారు. ఇకపై వైద్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 157 పీజీ సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చునన్నారు. గాంధీలో కొందరు బయటి వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని, ప్రమేయాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. నర్సుల భర్తీ ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. సాయి ప్రవళిక మృతిపై ఆయన మాట్లాడుతూ..పాప బతకదని వైద్యులు ముందే డిక్లేర్ చేశారని, కావాలనే ఆ ఘటనను వివాదం చేశారని, మీడియాను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమణి, గాంధీ వైద్యశాల ప్రిన్సిపాల్, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు. -
రేపు జిల్లాకు మంత్రి లక్ష్మారెడ్డి రాక
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హరితహారం హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ఎంజీఎం : జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రేపు(మంగళవారం) చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రెటరీ రాజేశ్ తివారీ హాజరుకానున్నట్లు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాల, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ఎంజీఎం ఆస్పత్రి, రోహిణి నర్సింగ్ కళాశాల, జయ నర్సింగ్ కళాశాల, గోపాలపురం ఆయుర్వేద కళాశాలల్లో 5 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అలాగే కాళోజీ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుర్వేదిక్ కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. -
అప్పుడెక్కడున్నారీ సన్నాసులు?
మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ను బాంబులతో పేల్చినప్పుడు ఇప్పుడు ధర్నాలు చేస్తున్న ఈ సన్నాసులు ఎక్కడున్నారని ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, రేవంత్‌రెడ్డిలను ఉద్దేశించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణతో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కర్ణాటక సర్కారుతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారని, త్వరలో అక్కడికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఓ వైపు ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు జరుగుతుంటే ఓ సన్నాసి దీక్ష చేయడం మరో సన్నాసి మద్దతు తెలుపడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్డీఎస్ గేట్లను పగులగొడితే నోర్లు మూసుకున్న ఈ దద్దమ్మలు.. పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం తగదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా తొత్తులుగా ఉన్న వీరే అన్యాయం చేసి.. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు కలుసుకోవడం నీచరాజకీయాలకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. -
తెలంగాణలో ఎయిమ్స్‌కు కృషి
♦ ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ: దత్తాత్రేయ ♦ వైద్య, ఆరోగ్య పరిస్థితులపై మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను తెలంగాణలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తానని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య పరిస్థితులపై ఆదివారం మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నతాధికారులతో ఈఎస్ఐసీ కార్యాలయం లో దత్తాత్రేయ సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా వంటి జ్వరాల బారిన పడి ఏటా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వ్యాఖ్యానించా రు. ఇక బస్తీల్లో ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... రాష్ట్రాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో విలువైన పరికరాలకు కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో కార్మికులకు వార్డులు కేటాయించాలనే ప్రతిపాదన వచ్చిందని, దీనిపై ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చించి ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పదిశాతం మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులున్నారని, వారికి మెరుగైన చికిత్స అందజేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. కేన్సర్ ఆస్పత్రుల్లో ట్రామా కేర్ సెంటర్, టీబీ స్కాన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అసంఘటిత కార్మికులందరికీ ఈఎస్ఐ.. అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ విడతల వారీగా ఈఎస్ఐ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. ఈ ఏడాది నుంచే భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణాలకు సంబంధించి సెస్ రూపంలో రూ.21వేల కోట్లు వసూలయ్యాయన్నారు. కానీ అందులో రూ.3వేల కోట్లు మాత్రమే కేంద్రానికి చేరాయని, మిగతా నిధులు రాష్ట్రాల వద్దే ఉండిపోయాయని... ఆ నిధులన్నీ కేంద్రానికి చేరినట్లయితే మంచి సంక్షేమ పథకాలు అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈఎస్ఐ బ్లాకులు ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్రం సహకారంతో ఆస్పత్రులన్నింటినీ బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ సమీక్షలో నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జీవీఎస్ మూర్తి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్ఎన్జే కేన్సర్ ఆస్పత్రి సూపరిటెండెంట్ జయలలిత తదితర అధికారులు పాల్గొన్నారు. -
ఎంఎన్జేలో క్యాజువాల్టీ వార్డు
కేన్సర్ ఆస్పత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సాక్షి, హైదరాబాద్: ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో క్యాజువాల్టీ వార్డు ఏర్పాటైంది. ఆస్పత్రి చరిత్రలో తొలిసారిగా నాలుగు పడకలతో దీన్ని ఏర్పాటుచేశారు. ‘నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన ప్రభుత్వం ఆస్పత్రి అవుట్పేషంట్ బ్లాక్‌లో నాలుగు పడకల సామర్థ్యంతో ఓ క్యాజువాల్టీ వార్డును కూడా ఏర్పాటు చేసింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో తీవ్ర దోపిడీకి గురై, ఇక తమ వల్ల కాదంటూ ఏ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియాకో తమ ఆస్పత్రుల నుంచి బలవంతంగా పంపించేస్తున్న రోగులకు క్యాజువాల్టీలో సేవలు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. వార్డులన్నీ తిరిగిన మంత్రి... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ఉదయం ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలు, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఓపీ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాజువాల్టీ సహా ఓపీ బిల్డింగ్‌పై కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్స్ వార్డు తదితర విభాగాల్లో కలియతిరిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ జయలత ఆస్పత్రిలోని పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆస్పత్రికి కావాల్సిన వైద్య పరికరాలు, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపాల్సిందిగా మంత్రి ఆమెకు సూచించారు. త్వరలో బ్లడ్ కాంపోనెంట్ సెపరేట్ మిషన్ ఆస్పత్రికి వారం రోజుల్లో ‘బ్లడ్ కాంపోనెంట్ సెల్ సెపరేట్ మిషన్’ను అందిస్తామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. లాండ్రీ, కిచెన్ కోసం అధునాతన భవనాలు నిర్మిస్తామన్నారు. శిథిలావస్థకు చేరినపాత భవనాన్ని ఆధునీకరించి రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అక్కడే ఉన్న టీఎస్ఎంఐడీసీ అధికారులకు మంత్రి ఆదేశించారు. విద్యు త్ సరఫరాలో హెచ్చు తగ్గులను నివారించేందుకు మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని వైద్యులు కోరగా, తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ఓపీబ్లాక్ రెండో అంతస్తులో కొత్తగా నిర్మించిన ఇన్‌పేషంట్ వార్డులో అవసరమైన వెంటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన్ సిష్టం, పడకలు,ఇతర అవసరాలు సమకూర్చి రోగులకు అందుబాటులోకి తెస్తామన్నారు. మంత్రి వెంట నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ డాక్టర్ రమణి, తదితరులు ఉన్నారు. -
సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు: లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : కొన్ని పత్రికలు అనవసరమైన రాతలు రాస్తున్నాయని, అయితే ప్రజల ఆరోగ్యం కోసం సాక్షి మీడియా లివ్ వెల్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్ హైటెక్స్‌లో సాక్షి ది 'లివ్ వెల్ ఎక్స్పో' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన లివ్ వెల్ ఎక్స్ప్రోను చేపట్టిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతిరోజై ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించాల్సిందేనని, వాటిని పాటిస్తే రోగాలు రాకుండా ఉంటాయన్నారు. గత ప్రభుత్వాలు ...ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేశాయని, దానివల్ల వైద్యం కోసం బీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించామని తెలిపారు. జిల్లా స్థాయి ప్రభుత్వాస్పత్రిల్లో వెంటిలేటర్లు, ఐసీయూలు లేని పరిస్థితి ఉందని, వాటని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల్లో అవసరం ఉన్నా లేకున్నా సర్జరీలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. -
లక్ష్మారెడ్డి Vs రేవంత్‌రెడ్డి
*మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం *వ్యక్తిగత దూషణ మానుకోవాలి: లక్ష్మారెడ్డి *అధికారిక సమావేశంలో రాజకీయాలొద్దు : రేవంత్‌రెడ్డి మహబూబ్ నగర్: ఓ అధికారిక సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. శుక్రవారం మద్దూరులోని ఎన్ఆర్ఎస్ఎంఎస్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భనవ ప్రారంభోత్సవానికి మంత్రి లక్ష్మారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ' కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టుతుందని, నేను డాక్టర్‌ను కానటా.. మున్నాబాయి సినిమాలో డాక్టర్నటా.. ఇలా కొంతమంది నేతలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులపై, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. కమీషన్ల ప్రభుత్వమే అయితే ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు కట్టబెట్టలేదా. గతంలో ఆంధ్రా పాలకులు కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపట్టిన విషయం గుర్తు పెట్టుకొని ఇలా ఆరోపణలు చేస్తున్నారు. నేను గుల్బర్గాలో డాక్టర్ చేశా. ఎవరైనా విచారణ చేసుకోవచ్చు.. ఆరోపణలు చేసినవారు ఏం చదివారో బయటపెట్టాలి. టీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదు. ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు'అని అన్నారు. దీంతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పైకి లేచి ‘ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమావేశం కాదు, అధికారిక సమావేశం. ఒకవేళ రాజకీయాలు మాట్లాడాలని అనుకుంటే నీవు, కేసీఆర్ టీడీపీలో ఉండి పదవులు అనుభవించ లేదా, టీఆర్ఎస్ పార్టీ నాయకుల చరిత్రలన్నీ తెలుసు’ అని అనడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వాగ్వివాదానికి దారితీసింది. ఇదంతా చూస్తున్న టీడీపీ, టీఆర్ఎస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. చివరికి మంత్రి కల్పించుకుని అందరినీ సముదాయించి సమావేశాన్ని ముగించారు.