'9 నెలల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక'
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జస్టిస్ మంజునాథ్ కమిషన్ 9 నెలల్లో నివేదిక ఇస్తుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ...కమిషన్లోని ఇతర సభ్యుల నియామకం, విధివిధానాలు త్వరలో రూపొందిస్తామన్నారు. కాపులను ఏ కేటగిరిలో చేర్చాలనేది కమిషన్ నిర్ణయిస్తుందన్నారు.
ఏపీలో బీసీ రిజర్వేషన్ 4 కేటగిరీలలో మొత్తం 144 కులాల వారున్నారని యనమల పేర్కొన్నారు. కాపుల రిజర్వేషన్ల విధివిధానాలపై చంద్రబాబుతో జస్టిస్ మంజునాథ్ గురువారం భేటీకానున్నారు. అంతకు ముందు విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో యనమలతో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్ని ముట్టడించనున్న నేపథ్యంలో మంత్రి, నేతలతో సమాలోచనలు జరిపారు. ఆందోళన విరమించుకోవాలని నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.