- కలెక్టరేట్ ఎదుట ధర్నా
- జోరు వానలోనూ మూడు గంటల పాటు నిరసన
మెట్టుపల్లిని ఇల్లంతకుంటలో కలపాలి
Published Sat, Sep 17 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
హన్మకొండ అర్బన్ : మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో కలపాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఆ సమయంలో జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సుమారు మూడు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేయడం గమనార్హం. తమ గ్రామాన్ని ఇల్లంతకుంటలో కలపడం వల్ల అన్ని విధాల సౌకర్యంగా ఉటుందని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రం కన్నా...ఇల్లంతకుంట తమ గ్రామానికి దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామం నుంచి పెద్దసంఖ్యలో మహళలు తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట కోలాంటం వేస్తూ నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.
Advertisement
Advertisement