వైభవంగా లేపాక్షి ఉత్సవాలు: బాలకృష్ణ
హైదరాబాద్ : డిసెంబర్ 27,28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నామని హిందుపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం బాలయ్య మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై మంత్రితో చర్చించామని, ముఖ్యమంత్రితో సమావేశమై ఉత్సవాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
లేపాక్షికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈసారి నందమూరి బాలకృష్ట రంగంలోకి దిగారు. లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.