‘స్ధానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు
‘స్ధానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు
Published Fri, Feb 17 2017 11:15 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
కాకినాడ సిటీ: జిల్లాలో స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి ఎన్నిక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఉభయ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జిల్లా నుంచి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎన్నిక నిర్వహణకు చేపడుతున్న చర్యలను వివరించారు. మొత్తం 1,477 మంది ఓటర్లు ఉండగా 1,420 మందికి డేటా ఎంట్రీ పూర్తి చేశామన్నారు. ప్రతీ మండలంలో ఎంపీడీఓ నేతృత్వంలో మోడల్ కోడ్ అమలు టీమ్‌లు, తహసీల్దార్ నేతృత్వంలో ప్లైయింగ్ స్క్వాడ్, ఆర్‌ఐ, వీడియోగ్రాఫర్లతో వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు డివిజన్ ప్రధాన కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పోలీస్ యంత్రాంగం సహకారంతో పటిష్ట బందోబస్తు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఏఎస్పీలు దామోదర్, శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు.
Advertisement