అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు.. | zp chairman election east godavari | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు..

Published Thu, May 18 2017 11:06 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు.. - Sakshi

అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు..

– నామన రాంబాబుకే పార్టీ పగ్గాలు!
–21న జిల్లా పార్టీ కార్యవర్గం ఎన్నిక 
- ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
భానుగుడి(కాకినాడ) : సారధి లేకుండా సాగుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అధ్యక్షుడి ఎన్నికతో పాటు జిల్లా తెదేపా కార్యవర్గాన్ని సైతం అదే రోజున ఎన్నుకోనున్నట్టు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ప్రకటించారు. జిల్లా అ«ధ్యక్షుడి ఎన్నిక ద్వారా జెడ్పీ పీఠమెక్కేదెవరో స్పష్టం కానుంది. ఈనెల 21న ఈ తంతు ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు కాకినాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విలేకరులకు వెల్లడించారు. అ«ధ్యక్ష, ఉపా«ధ్యక్షుడితో పాటు, పార్టీ కార్గవర్గసభ్యులను, వివిధ పదవులకు నాయకులను ఎన్నుకోనున్నామన్నారు. ఈనెల 24న ప్రత్తిపాడులో జరగనున్న మినీమహానాడుపై జిల్లా నాయకులతో చర్చించారు. విశాఖలో ఈనెల 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి జనసమీకరణకు సంబంధించి పార్టీ కేడర్‌తో చర్చించారు. 
బయట తిరగవద్దు..
 ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం 12 దాటితే బయటకు రావొద్దని హెచ్చరించారు. జిల్లాలో పార్టీ తరఫున నిర్వహిస్తున్న చలివేంద్రాలను ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. 
అసభ్యకర పోస్టింగ్‌లు పెడితే శిక్షలు తప్పవు..
సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెడితే శిక్షలు తప్పవని, ప్రస్తుతం ప్రభుత్వం సోషల్‌మీడియాపై నియంత్రణలో భాగంగా చేస్తున్న చర్యలను రాజప్ప సమర్థించుకున్నారు. సమావేశంలో రాజప్పతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా నామన పేరు ఖరారు..
జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా జెడ్పీ చైర్మన్‌ నామన పేరు ఖరారైనట్టు ఉపముఖ్యమంత్రి రాజప్ప తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ఈ నెల 21న నామన ఎన్నిక లాంఛనప్రాయమేనని, జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్‌కు మార్గం సుగమమైందంటున్నారు. అయితే నామన వర్గం ఈ విషయమై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంఇ. పంచాయితీని అధిష్టానం వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేక.. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నామన సమాయత్తమవుతున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement