
చాలీ చాలని వేతనంతో బతకలేక..
మృత్యు ఒడికి నవవధువు
పటాన్‌చెరు టౌన్: భర్తకు వచ్చే చాలీ చాలని వేతనంతో పట్టణంలో బతకలేక.. సొంత ఊరు తిరిగి వెళదామం టే భర్త అంగీకరించక, ఇక్కడ ఉండలేక మనస్తాపం చెందిన ఆ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని బోడపాడు గ్రామానికి చెందిన అరుణ(20) వరసకు బావైన ప్రసాద్‌ను నెలా 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా కూరేళ్లగూడెంవాసి. వీరిద్దరూ వివాహం అనంతరం బతుకుదెరువు కోసం పటాన్‌చె రు వలస వచ్చి శాంతినగర్‌లో ఉంటున్నారు. భర్త ప్ర సాద్ వెల్‌జన్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
నెలకు రూ. 7 వేల వేతనమే వస్తుం డడంతో ఇంటి అవసరాలకు సరిపోవడం లేదని అరు ణ తన భర్త ప్రసాద్‌ను స్వగ్రామానికి వెళ్దాం అని అడుగుతూ ఉండేది. ఈ క్రమంలో అరుణ రెండుస్లారు స్వగ్రామానికి వెళ్లి నెలకు రూ. 7వేల వేతనంతో తాము బతకలేకపోతున్నామని, ఊరికి తిరిగి వచ్చేద్దామంటే భర్త అంగీకరించడం లేదని తన తల్లితో చెప్పింది. భర్త ఊరు వెళదామంటే ఒప్పుకోవడం లేదు. నాకు పటాన్‌చెరులో ఉండాలనిపించడం లేదు.
అని తన తల్లితో తన బాధను చెప్పుకొని తిరిగి పటాన్‌చెరు వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రసాద్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లగా ఇంటి తలుపులకు లోపలి నుంచి గడియవేసి ఉంది. పొరుగు వారి సహా యంతో తలుపులు తీసి చూడగా ఇంటిపై కప్పు ఐరన్‌రాడ్‌కు చున్నీతో ఉరి వేసుకుని అరుణ ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.