ఒక ప్రక్క ప్రభుత్వం ప్రజలను హైటెక్కుకు మళ్లించాలని బలవంతపు ప్రయోగాలు చేపడుతోంది. ఇదే అదనుగా ఆ¯ŒSలై¯ŒS మోసగాళ్లు విజృంభిస్తున్నారు. విషయానికి వస్తే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కె.గంగవరం మండలం కుందూరు గ్రామానికి
ఫోన్ కాల్తో అకౌంట్‌లో సొమ్ములు మాయం
Jan 27 2017 11:25 PM | Updated on Apr 3 2019 8:07 PM
ద్రాక్షారామ (రామచంద్రపురం) :
ఒక ప్రక్క ప్రభుత్వం ప్రజలను హైటెక్కుకు మళ్లించాలని బలవంతపు ప్రయోగాలు చేపడుతోంది. ఇదే అదనుగా ఆ¯ŒSలై¯ŒS మోసగాళ్లు విజృంభిస్తున్నారు. విషయానికి వస్తే బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కె.గంగవరం మండలం కుందూరు గ్రామానికి చెందిన కొరిపల్లి శ్రీనువాసుకు ద్రాక్షారామ స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 19న అతనికి 7546944897 నంబరు గల సెల్ నుంచి ఫో¯ŒS వచ్చింది. మేం ద్రాక్షారామ బ్యాంకు నుంచి ఫో¯ŒS చేస్తున్నాం మీ బ్యాంకు అకౌంట్ లాక్ అయ్యింది (అకౌంట్ నెంబరు చెప్పి), మీ ఏటీఎం కార్డు మీద ఆఖరి ఐదు నెంబర్లు చెప్పండి అనడంతో శ్రీనివాస్ ఆ కాల్ నిజమనుకుని వివరాలు చెప్పాడు. తరువాత రోజు బ్యాంకుకు వెళ్లి చూడగా ఖాతాలో రూ. 97,978 లు సొమ్ము మాయమైంది. బ్యాంకు అధికారులకు విషయం చెప్పగా సదరు ఫో¯ŒS చేసిన వ్యక్తి సొమ్ములు కాజేసాడని చెప్పడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని శ్రీనివాస్ తెలిపాడు. శుక్రవారం ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రీనివాస్ తెలిపాడు.
Advertisement
Advertisement