
మొరాయించిన ఇంటర్నెట్
సంగెం : స్థానిక ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం ఇంటర్నెట్ సమస్య ఏర్పడడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం ఇం టర్నెట్ నిలిచిపోగా ఉద్యోగులు హన్మకొండ వెళ్లి తమ లావాదేవీలు ముగించుకున్నారు.
అయితే, శుక్రవారం బ్యాంకు తెరిచాక కూడా ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో ఉద్యోగులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నెట్ పనిచేయడంతో వినియోదారులకు డబ్బు అందజేశారు.