మదర్‌థెరిస్సా సేవలు మరవలేనివి
ఆదిలాబాద్ కల్చరల్ : భారతరత్న మథర్‌థెరిస్సా దేశ ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని, ప్రపంచ దేశాలకు ఆమె సేవలు ఆదర్శమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ అన్నారు. జిల్లా కేంద్రంలోని హోలీ ఫ్యామిలీ క్యాథలిక్ చర్చిలో ఆదివారం మథర్‌థెరిస్సాకు పునీతురాలుగా బిరుదు ప్రదానాన్ని పురస్కరించుకుని సంబరాలు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీశ, క్యాథలిక్ Sబిషఫ్ ప్రిన్స్ ఆంటోని, క్యాథలిక్ చర్చి ఫాదర్ బైజూజాన్ మదర్‌థెరిస్సా ప్రతిమ వద్ద పూలతో సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మధర్‌థెరిస్సాను ఆదర్శంగా తీసుకుంటున్నాయని, సేవాభావం అమ్మతత్వం కలిగిన స్ఫూర్తిప్రదాయిని అని కొనియాడారు. పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. రోగుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.