మెదక్ జిల్లా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
మెదక్: మెదక్ జిల్లా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కల్హేర్ మండలం చందర్నాయక్ తాండా వద్ద బీబీ పాటిల్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పాటిల్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.