మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం | mrps burnt kalava Scarecrow | Sakshi
Sakshi News home page

మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం

Published Sat, Apr 8 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం

మంత్రి కాలవ దిష్టిబొమ్మ దహనం

పామిడి (గుంతకల్లు) : అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అంబేడ్కర్‌సర్కిల్‌లో శనివారం సాయంత్రం దళితసంఘాల ఆధ్వర్యంలో మంత్రి కాలవ శ్రీనివాసులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు టి.మల్లికార్జున, వెంకటేష్‌ మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు బూటుకాళ్లతోనే ఐలాండ్‌పైకి వెళ్లి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు నివాళులర్పించడం శోచనీయమన్నారు.

మంత్రిగా ఉన్న ఆయన  భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.  మంత్రి తన తప్పిదాన్ని తెలుసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే కాలవకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నేతలు రామాంజనేయులు, మల్లి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement