లడ్డూను దక్కించుకున్న కాలేద్ ఖులేదీ
నిమజ్జనోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన కాలేద్ ఖులేదీ లడ్డూను దక్కించుకున్నాడు
చాంద్రాయణగుట్ట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి కాలేద్ ఖులేదీ మతసామరస్యాన్ని చాటి చెప్పాడు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడీ ప్రాంతంలో జై దుర్గా భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి చేతిలో ఉంచిన 21 కిలోల లడ్డూకు గురువారం వేలం పాట నిర్వహించగా, స్థానిక బియ్యం వ్యాపారి కాలేద్ ఖులేదీ రూ.41 వేలకు వేలంపాడి గణనాథుడి లడ్డూను దక్కించుకున్నాడు. మతాలకతీతంగా కాలేద్ లడ్డూ కొనుగోలు చేయడం పట్ల చాంద్రాయణగుట్ట వాసులు హర్షం వ్యక్తం చేశారు.