వైవీయూలో మల్టీ ఛానల్‌ సిస్టం ఏర్పాటు | multi-channel system set up in yvu | Sakshi
Sakshi News home page

వైవీయూలో మల్టీ ఛానల్‌ సిస్టం ఏర్పాటు

Published Thu, Oct 27 2016 12:09 AM | Last Updated on Sat, Sep 15 2018 7:45 PM

వైవీయూలో మల్టీ ఛానల్‌ సిస్టం ఏర్పాటు - Sakshi

వైవీయూలో మల్టీ ఛానల్‌ సిస్టం ఏర్పాటు


వైవీయూ:
యోగివేమన విశ్వవిద్యాలయం, విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో కుదిరిన ఎంఓయూలో భాగంగా వైవీయూలో మల్టీఛానల్‌ మల్టీ కాన్ట్సులేషన్‌ సిస్టంను ఏర్పాటు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను వీఎస్‌ఎస్‌సీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజ్‌కుమార్‌చౌదరి, సార్క్‌ కో–ఆర్డినేటర్, వైవీయూ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ డా. కె. కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. వైవీయూలోని సర్‌ సీవీరామన్‌ సైన్స్‌బ్లాక్‌ పై భాగంలో ఏర్పాటు చేస్తున్న పనులను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సిస్టం ఏర్పాటు చేయడం ద్వారా వైవీయూ నుంచి 22 కిలోమీటర్ల పరిధిలోని ల్యాండ్‌ను గుర్తించడం, హద్దులు కనుగొనడం వంటివి స్పష్టంగా ఇంటర్నెట్‌ ద్వారా గుర్తించవచ్చన్నారు. దీని పరిధిలో ఎక్కడ ఏమి జరిగినా జీపీఎస్‌ సిస్టం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. వీరి వెంట వీఎస్‌ఎస్‌సీ టెక్నికల్‌ ఆఫీసర్‌ డా. మహమ్మద్‌ నజీర్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement