బంజారాహిల్స్: సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఆర్గానిక్ ఫుడ్ సరఫరా చేసే టెండర్ దక్కిందని ఆర్గానిక్ హట్ పేరుతో సూపర్‌బజార్‌ను నడిపిస్తున్నానని పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొని మోసంచేసిన న్యూట్రిషియన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటగిరికి చెందిన విఘ్నేశ్వర్(34) తనను న్యూట్రీషియన్‌గా చెప్పుకుని ఓ కిచెన్ ఏర్పాటు చేశాడు.
వివిధ సాఫ్ట్‌వేర్ సంస్థల నుంచి దొంగ ఆర్డర్ డాక్యుమెంట్లు సృష్టించి వారికి ఆర్గానిక్ ఆహారం సరఫరా చేసే వ్యాపారంలో పెట్టుబడులను ఆహ్వానించాడు. అలాగే ఆర్గానిక్ హట్ అనే పేరుతో బజార్ నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో వాసు అనే వ్యక్తి రూ. 20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అతనితో పాటు రాధ, జైపాల్‌రెడ్డి, సూరి పలువురు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.
అయితే నాలుగేళ్లు గడచినా వ్యాపారం ప్రారంభం కాకపోవడంతో బాధితులు నిలదీయగా వారికి చెక్కులు ఇచ్చిడు. అవి బౌన్్స కావడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా ఆర్గానిక్ హట్ పేరుతో ఎలాంటి బజార్ లేదని సాఫ్ట్‌వేర్ సంస్థల ఆర్డర్లు కూడా బోగస్‌గా తేలింది. తాము మోసపోయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.