మహబూబ్నగర్: టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి శనివారం మహబూబ్నగర్లో నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ ద్రోహులతో నిండిపోయిందన్నారు. ఇరిగేషన్ శాఖలో అవినీతికి బాట వేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయ పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు.... టీఆర్ఎస్ బంట్రోతులుగా వ్యవహరిస్తున్నారని నాగం పేర్కొన్నారు.