విలువిద్యలో మేటి ఉమాదేవి | national archery game selected uma devi | Sakshi
Sakshi News home page

విలువిద్యలో మేటి ఉమాదేవి

Published Sat, Jan 28 2017 11:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

విలువిద్యలో మేటి ఉమాదేవి

విలువిద్యలో మేటి ఉమాదేవి

  • జాతీయస్థ్ధాయి విలువిద్య పోటీలకు ఎంపిక
  • అడ్డతీగల : 
    ఆమె కటిక దరిద్య్రాన్ని అనుభవిస్తోంది. తండ్రి చనిపోయి ఎనిమిదేళ్లయింది. ఇటు చదువుతో పాటు అటు తనకెంతో ఇష్టమైన విలువిద్యలో మెళకువలు నేర్చుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అడ్డతీగల ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతున్న కోసూరి ఉమాదేవి త్వరలో రాజస్థా¯ŒSలో జరిగే జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైంది. ఉమాదేవి తొలుత గత నవంబర్‌లో కాకినాడలో జరిగిన పాఠశాల స్థాయి అండర్‌–17 విభాగంలో ఉత్తమప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిౖకైంది. అదే నెలలో చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన రా ష్ట్ర స్థాయి పోటీల్లో నాల్గో స్థానంలో నిలిచింది. గత డిసెంబర్‌లో కాకినాడలోజరిగిన ఖేలోఇండియా విలువిద్య పోటీల్లో అండర్‌–17 విభాగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపికైంది. గుంటూరులో జరిగిన గిరిజన రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లోన ఉమాదేవి మూడో స్థానంలో నిలిచింది. ఈనెల 11,12,13 తేదీల్లో చిత్తూరులోని పీవీకేఎ¯ŒS కాలేజీలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌–17 విలువిద్య పోటీల్లో 30, 40 మీటర్ల విభాగాల్లో అత్యత్తమ ప్రతిభ ప్రదర్శించి రాజస్థా¯ŒSలో జరగనున్న జాతీస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఉమాదేవిని పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్‌బాబు, పీడీ నాగమణి, పీఈటీ బుచ్చన్నదొర, ఉపాధ్యాయులు అభినందించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement