ప్రకతి సేద్యంతో నాణ్యమైన ఉత్పత్తులు
Published Tue, Jul 26 2016 12:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
ప్రకతి సేద్యంతో నాణ్యమైన ఉత్పత్తులు, natural, cultivation, quality products
యలమంచిలి: జీరో బడ్జెట్ (పెట్టుబడిలేని) ప్రకతి వ్యవసాయమే మేలని వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడిలేని ప్రకతి వ్యవసాయంపై సోమవారం కొత్తలిలో రైతులకు వ్యవసాయాధికారులు శిక్షణ ఇచ్చారు. దీనిని పర్యవేక్షించడానికి వచ్చిన డీపీఎం లక్ష్మణరావు, మండల ప్రత్యేకాధికారి సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన అధికారులు ఎవరైతే సేంద్రియ వ్యవసాయం అనుసరిస్తున్నారో వారికి ఉచితంగా కూరగాయల విత్తనాలు, వ్యవసాయ నిపుణులచే చెప్పిన వీడియో పాఠాల సీడీలు అందజేశారు. ప్రకతి వ్యవసాయ విధానంపై యలమంచిలి వ్యవసాయాధికారి వి.మోహనరావు రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. రసాయనిక, సేంద్రియ సాగు వల్ల జరుగుతున్న అనర్ధాల గురించి తెలియజేశారు. దిగుబడి పెరగడానికి జీరో బడ్జెట్ సేద్యమే రైతులకు ఉపయోగపడుతుందన్నారు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోతున్న రసాయనిక వ్యవసాయం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం పూర్తిగా స్వదేశీ విధానమని తెలిపారు. రసాయనిక వ్యవసాయాన్ని రైతులు మానుకోవాలని సూచించారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని శాస్వతంగా పరిష్కరించడానికి నాటు ఆవుతో పెట్టుబడిలేని ప్రకతి సేద్యం అవస్యమన్నారు. ఘనజీవామతం తయారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా రైతులకు తెలియజేశారు. రైతుల సందేహాలను వారికి అర్ధమయ్యే విధంగా నివత్తిచేశారు. కార్యక్రమంలో ఏఈఓ దేముడు, కొత్తలి ఎంపీటీసీ ఇత్తంశెట్టి రాజు, మర్రి సూరిబాబు, రైతులు పాల్గొన్నారు.
25వైఎల్‌ఎం06: కొత్తలిలో ఆవు ప్రయోజనాలు వివరిస్తున్న వ్యవసాయాధికారులు
Advertisement
Advertisement