
దుర్గమ్మ సన్నిధిలో నవగ్రహ యంత్ర పూజలు
కార్తీక మాసం సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో బుధవారం నవగ్రహ యంత్ర పూజలు నిర్వహించారు. నవగ్రహ యంత్రాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది పుష్పాలతో అలంకరించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీక మాసం సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో బుధవారం నవగ్రహ యంత్ర పూజలు నిర్వహించారు. నవగ్రహ యంత్రాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది పుష్పాలతో అలంకరించారు. కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణ పూజా కార్యక్రమాలను జరిపారు. నవగ్రహ యంత్ర పూజలతో దోష పరిహారం కలిగి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయని అర్చకులు పేర్కొన్నారు. యంత్రం చుట్టూ ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించి పూజలు నిర్వహించారు.